వీడియో : ఘోర విమాన ప్రమాదం.. కూలింది ఇలా..

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్ లో బుధవారం(జనవరి 8,2020) ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సహా 180మంది చనిపోయారు.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 07:45 AM IST
వీడియో : ఘోర విమాన ప్రమాదం.. కూలింది ఇలా..

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్ లో బుధవారం(జనవరి 8,2020) ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సహా 180మంది చనిపోయారు.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్ కు సమీపంలో బుధవారం(జనవరి 8,2020) ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సహా 178మంది చనిపోయారు. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం టేకాఫ్‌ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం కూలిన వెంటనే మంటల్లో చిక్కుకుంది. ఆ తర్వాత పెద్ద బ్లాస్ట్ జరిగింది. దీంతో అంతా సజీవదహనం అయ్యారు. గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్లు వీడియో ఫుటేజ్‌లో స్పష్టమవుతోంది. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి.

టెహ్రాన్‌లోని ఇమామ్ ఖయోమీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విమానం కూలింది. బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. ఉక్రెయిన్‌ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం 169 మంది ప్రయాణికులు, 9మంది సిబ్బందితో కీవ్‌ వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికుల సహా సిబ్బంది మొత్తం మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. విమానం కూలిపోయిన దృశ్యాలను కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 

అమెరికా సైన్యం 1988లో జరిపిన బాంబు దాడిలో 290 మంది ఇరానియన్లు మృతి చెందారని, దీని తర్వాత ఏం జరిగిందో ఆ దేశం గుర్తుంచుకోవాలంటూ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరిస్తూ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు ట్వీట్ చేసిన గంటల్లోనే ఉక్రెయిన్ విమానం కూలిపోవడం అనుమానాలకు దారితీసింది.