Pop-star Shakira: 11 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పిన పాప్ స్టార్ షకీరా: భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటన

వ్యక్తిగత కారణాల వలన తమ 11 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ తామిద్దరం విడిపోతున్నామని షకీరా దంపతులు ప్రకటించారు.

Pop-star Shakira: 11 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పిన పాప్ స్టార్ షకీరా: భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటన

Shakira

Pop-star Shakira: ప్రముఖ పాప్ సింగర్, షకీరా తన భర్త, ఫుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పైక్ నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వలన తమ 11 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ తామిద్దరం విడిపోతున్నామని షకీరా దంపతులు ప్రకటించారు. కొలంబియాకు చెందిన 45 ఏళ్ల షకీరా 90, 2000 దశకాల్లో తన పాటలతో కుర్రకారును ఉర్రుతలూగించింది. హిప్స్ డోన్ట్ లై, వాకా వాకా, Whenever – Wherever, Can’t Remember to Forget You వంటి హిట్ సాంగ్స్ తో.. జెన్నిఫర్ లోపెజ్, బియోన్సే వంటి స్టార్ సింగర్స్ సరసన నిలిచింది షకీరా. ఇక తనకంటే వయసులో పదేళ్ల చిన్నవాడైన ఫుట్ బాల్ క్రీడాకారుడు, స్పెయిన్ దేశస్తుడు గెరార్డ్ పైక్ ను పెళ్లి చేసుకున్న షకీరా..వైవాహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ..క్రమంగా పాటలను తగ్గించింది.

Other Stories: Cell Phone Free City : ఆ ఊర్లో సెల్‌ఫోన్,టీవీ,రేడియో నిషేధం-ఎందుకు…ఎక్కడ….?

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాము విడాకులు తీసుకున్నా తమ మొదటి ప్రాధాన్యత పిల్లలకే ఉంటుందని చెప్పిన షకీరా.. పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాలని మీడియాను కోరింది. కాగా, స్పెయిన్ దేశంలో పన్ను ఎగవేతపై బార్సిలోనా కోర్టు షకీరాకు నోటీసులు పంపిన వారం తరువాత ఈ జంట విడిపోతున్నట్టు ప్రకటించింది. షకీరా భర్త గెరార్డ్ స్పెయిన్ దేశస్తుడు. దీంతో 2011లో షకీరా భర్తతో కలిసి స్పెయిన్ లో స్థిరపడింది. ఈక్రమంలో 2012 – 2014 మధ్య షకీరా ఆర్జించిన ఆదాయంపై 14.5 మిలియన్ యూరోలు (USD 15.5 మిలియన్లు) పన్ను ఎగవేసినట్లు స్పానిష్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

Other Stories: Attacks in USA: అమెరికాలో ఆగని దాడులు: ఆసుపత్రిలో వైద్యురాలు, నర్సులపై వ్యక్తి దాడి

అధికారికంగా షకీరా స్పెయిన్ లో నివసిస్తున్నా 2014వరకు పన్ను రెసిడెన్సీని మాత్రం బహామాస్ దేశంలో కొనసాగించిందని వారు చెప్పారు. దీనిపై షకీరా తరుపు న్యాయవాదులు స్పందిస్తూ 2015లో మాత్రమే షకీరా పూర్తిగా స్పెయిన్ దేశానికి మారినట్లు చెప్పారు. “ఆమె పన్నులు చెల్లించాల్సిన అన్ని దేశాల్లో పన్ను విషయాలపై ఆమె ప్రవర్తన ఎల్లప్పుడూ తప్పుపట్టలేనిది” అని నొక్కి చెప్పారు.