తన కొడుకు కంటే 6 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న ఆంటీ

  • Published By: chvmurthy ,Published On : April 13, 2020 / 09:49 AM IST
తన కొడుకు కంటే 6 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న ఆంటీ

ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అనేది సామెత.  ఇది నిజం చేశారు బ్రెజిలియన్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ తల్లి నాడిన్ గోన్కల్వ్స్. 52 ఏళ్ల నాడిన్ తన కొడుకు నేమార్ కంటే 6 ఏళ్లు చిన్న ఐన 22 ఏళ్ల యువ వీడియో గేమర్ తో  డేటింగ్ చేస్తున్నారు.  ఆమె ఇటీవల గేమర్ టియాగో రామోస్ తో తనకున్న సంబంధం గురించి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. 

అక్కడ ఆమె  ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఆమె రామోస్ ను ఆలింగనంచేసుకున్నట్లు ఉంది. అక్కడ  ఆమె తమ బంధం గురించి   ఒక వ్యాఖ్య చేశారు. “”వివరించలేనిది, వివరించబడదు… మీరు జీవించండి”” అంటూ పోర్చు గీస్ లో రాశారు. 

dating1

25 ఏళ్ళ వివాహాబంధం అనంతరం మొదటి భర్త ఏజెంట్ వాగ్నెర్ రిబీరో నుంచి ఆమె 2016లో విడాకులు తీసుకున్నారు.  ఇన్ స్టా గ్రామ్ లో తల్లి పోస్టు గురించి నేమార్ స్పందించాడు. కొత్త బంధంలోసంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 

dating 2

ఆమె భర్త కూడా కొత్త సంబంధాన్నిమెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను డేటింగ్ చేస్తున్న యువకుడు  నేమార్ అభిమాని అని తనకొడుకు అంటే అతనికి చాలా ఇష్టమని ఆమె  పేర్కోంది.  నేమార్ ఆటకు తాను అభిమాని అని తెలియ చేశాడు ఆయువకుడు. 

dating 3

సోషల్ మీడియాలో వీరి డేటింగ్ పై విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.రామోస్ నేమార్  స్టెప్ డాడ్ అని కామెంట్లు కూడా చేస్తున్నారు. కానీ ఎక్కవ మంది నాడిన్ గోన్కల్వ్స్ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Inexplicável ❤️

A post shared by Tiago Ramos ???????????? (@tiagoramoss) on