మాజీ ప్రధానికి గుండెపోటు

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని పాక్ మీడియా తెలిపింది. ఇటీవలే నవాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లాహోర్ లోని ఆస్పత్రికి తరలించి

10TV Telugu News

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని పాక్ మీడియా తెలిపింది. ఇటీవలే నవాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లాహోర్ లోని ఆస్పత్రికి తరలించి

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని పాక్ మీడియా తెలిపింది. ఇటీవలే నవాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లాహోర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్ మెంట్ సమయంలోనే నవాజ్ కు గుండెపోటు వచ్చినట్టు పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మిర్ ట్విటర్ లో తెలిపారు. ప్రస్తుతం నవాజ్ కోలుకుంటున్నప్పటికీ నీరసంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

షరీఫ్ కు ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తొలుత వాటి సంఖ్య పెరిగినప్పటికీ మళ్లీ పడిపోవడంతో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం దృష్ట్యా చౌదరి చక్కెర మిల్లుల కేసులో షరీఫ్ కు బెయిల్ మంజూరైంది. పూచీకత్తుగా రూ.10మిలియన్ల విలువైన రెండు బాండ్లను సమర్పించాలని షరతు విధిస్తూ లాహోర్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. నవాజ్‌ షరీఫ్‌కు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు.

జైల్లో ఉన్న నవాజ్‌ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇటీవలే పెరోల్ మీద బయటకు వచ్చారు. కొద్దిరోజులుగా పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న షరీఫ్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది. నవాజ్ షరీఫ్ తిరిగి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారనే వార్తలు వస్తున్న సమయంలోనే ఆయన అనారోగ్యం పాలయ్యారు.