Bill Clinton : ఐసీయూలో అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ (75) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ

Bill Clinton : ఐసీయూలో అమెరికా మాజీ అధ్యక్షుడు

Clinton

Bill Clinton అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ (75) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కాలిఫోర్నియా లోని.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ మెడికల్ సెంటర్‌లో బిల్‌క్లింటన్‌ చేరారని వ్యక్తిగత సిబ్బంది ఏంజెల్ యురేనా గురువారం తెలిపారు. అయితే ఆయనకు కొవిడ్ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు ఏమీ సోకలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్లింటన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ప్రత్యేక వైద్యుల బృందంతో పాటు నర్సులు, హాస్పిటల్ సిబ్బంది క్లింటన్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు.

అయితే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ కారణంగానే క్లింటన్ హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్లింటన్ ను ఐసీయూ(Intensive Care Unit)లో ఉంచినట్లు సమాచారం. క్లింటన్ చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్లింటన్ వైద్యులు డాక్టర్ అల్పేష్ అమిన్ మరియు డాక్టర్ లిసా బార్డాక్ ఒక ప్రకటనలో..క్లోజ్ మానిటరింగ్ కోసం క్లింటన్ హాస్పిటల్ లో చేర్చబడ్డారు. . IV యాంటీబయాటిక్స్ మరియు ఫ్లూయిడ్స్ అందించబడ్డాయి. నిరంతర పర్యవేక్షణ కోసం క్లింటన్ ఆసుపత్రిలోనే ఉన్నాడని తెలిపారు. రెండు రోజుల చికిత్స తర్వాత, అతని తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గుతోందని మరియు యాంటీబయాటిక్‌లకు ఆయన బాగా స్పందిస్తున్నాడని ప్రకటనలో డాక్టర్ల బృందం తెలిపింది.

1993-2001 మధ్య రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్‌ సేవలందించారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతి నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్‌ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో 2005లోనూ తిరిగి హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది.

2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టంట్లు అమర్చారు. తర్వాత కొన్ని రోజులకు కోలుకున్న బిల్‌క్లింటన్‌ పూర్తి ఆరోగ్యంగా కనిపించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రచారంలోనూ పాల్గొన్నారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌ తరపున ప్రచార బాధ్యతలను బిల్‌క్లింటన్‌ చేపట్టారు.

ALSO READ అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు..7గురు మృతి