Donald Trump: అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌కు షాకిచ్చిన కోర్టు..

తీర్పును కోర్టులో సవాలు చేస్తునంత కాలం డొనాల్డ్ ట్రంప్ పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Donald Trump: అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌కు షాకిచ్చిన  కోర్టు..

Former US President Donald Trump

Donald Trump: అమెరికాలో 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నూయార్క్ ఫెడరల్ జ్యూరీ ఓ కేసు విషయంలో ట్రంప్‌ను దోషిగా తేల్చింది.. 1990లో మ్యాగజైన్ రచయిత ఇ.జీన్ కారోల్ పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ట్రంప్‌ను దోషి అని జ్యూరీ తీర్పు ఇచ్చింది. అంతేకాదు. అనేక సందర్బాల్లో జీన్ కారోల్ ను అబద్దాలకోరు అని పిలిచి ఆమెను అప్రతిష్టపాలు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించారు.  దీంతో కరోల్‌కు ఐదు మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ జరిమానా విధించింది.

Donald Trump : ట్రంప్‌పై అత్యాచారం కేసు .. కోర్టుకెక్కిన 79 ఏళ్ల మహిళ

ఇదిలాఉంటే.. జీన్ కారోల్‌పై అత్యాచారం చేసిన కేసులో మాత్రం ట్రంప్ నిర్దోషి అని జ్యూరీ నిర్ధారించింది. కారోల్ ట్రంప్ పై చేసిన అత్యాచారం అభియోగాన్ని జ్యూరీ తిరస్కరించింది.  కారోల్ పై లైంగిక వేధింపుల కేసు విచారణ ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమైంది. తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ పలు దఫాల విచారణ అనంతరం ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించింది. అయితే, జ్యూరీ తీర్పుపై ట్రంప్ స్పందించారు. ఈ తీర్పు అవమానకరమైనది.ఈ మహిళ ఎవరో నాకు ఖచ్చితంగా తెలియదు అంటూ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‍‌లో ట్రంప్ పోస్టు చేశారు.

Donald Trump: అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి వచ్చేటప్పుడు శునకాలను ఏం చేశారో చెప్పిన ట్రంప్

1996లో మాన్‌హాటన్‌లోని ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెసింగ్ రూంలో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని ఇ. జీన్ కారోల్ ఆరోపించింది. ఈమెకు ప్రస్తుతం 79ఏళ్లు. ఈ విషయాన్ని ఆమె 2019లో ఒక పుస్తకంలో మొదట ప్రస్తావించింది. ఇటీవల కాలంలో డజనుకుపైగా మహిళలు ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం విధితమే. వీరిలో ఫోర్న్ స్టార్ స్టార్మీ డేవియల్స్ కూడా ఉన్నారు. స్టార్ స్టార్మీ కేసు విషయంలోనూ గతంలో ట్రంప్‌కు చుక్కెదురైంది. తాజాగా జీన్ కారోల్ ట్రంప్ పై చేసిన అభియోగాలను తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ నిజమేనని నిర్ధారించింది. ఈ క్రమంలో ట్రంప్‌ను దోషిగా పేర్కొంటూ అతనికి ఐదు మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. ఈ లైంగిక వేధింపుల కేసులు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయాలనే ప్లాన్‌కు విఘాతం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్… లైవ్ అప్‌డేట్స్

ఇదిలాఉంటే ట్రంప్ జ్యూరీ తీర్పుపై అప్పీల్ చేస్తారని ఆయన అధికార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ తెలిపారు. అంటే, తీర్పును కోర్టులో సవాలు చేస్తునంత కాలం అతను పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు.