కరోనా పాజిటివ్ రావడంతో డాక్టర్ ఆత్మహత్య

  • Published By: vamsi ,Published On : April 6, 2020 / 07:37 AM IST
కరోనా పాజిటివ్ రావడంతో డాక్టర్ ఆత్మహత్య

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా కష్టపడుతున్న డాక్టర్లను ప్రపంచవ్యాప్తంగా దేవుళ్లుగా భావిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ బారిన పడ్డ ఓ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకోవడం కలవరపెడుతుంది. ఈ ఘటన  ఫ్రాన్స్‌లో చోటు చేసుకోగా.. ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌లో భాగంగా ఓ క్లబ్‌ జట్టుకు డాక్టర్‌గా ఉన్న బెర్నార్డ్‌ గోంజ్‌లెజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టైన లిగీ-1 రీమ్స్‌ డాక్టర్‌ బెర్నార్డ్‌ గోంజెలెజ్‌కు కరోనా వైరస్‌ సోకింది.

అతను కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురవగా.. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో మనస్థాపానికి గురైన అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది ఆ దేశ ఫుట్‌బాల్‌ రంగాన్ని కలవరపాటుకు గురి చేస్తుంది. అతను బతకడు అని డిసైడ్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రీమ్స్‌ మేయర్‌ అర్మౌడ్‌ రాబినెట్‌ అనుమానం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్‌  ఫ్రాన్స్‌లో విజృంభిస్తుండగా.. ఇప్పటికే ఎనిమిది వేల మంది చనిపోయారు. ఫ్రాన్స్ మరణాల సంఖ్య ఇప్పుడు చైనాని దాటేసింది. అయితే, దేశంలో మరణాల రేటు మందగించినట్లు చెబుతున్నారు. ఆదివారం 357 మంది మరణించగా.. అంతకుముందు రోజు 441 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

సోమవారం నాటికి 28,891 మంది కరోనా పాజిటివ్ అయ్యి ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 6,978 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నారు.

Also Read | పెళ్లి చేసుకోమంటే.. కారులో రేప్ చేసి flyover కింద కాల్చేశాడు