నల్లులపై ఫ్రాన్స్ యుద్ధం!!: కంటిపై కునుకులేదు..కుట్టి కుట్టి చంపేస్తున్నాయిరా బాబూ..

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 06:00 AM IST
నల్లులపై ఫ్రాన్స్ యుద్ధం!!: కంటిపై కునుకులేదు..కుట్టి కుట్టి చంపేస్తున్నాయిరా బాబూ..

ఫ్రాన్స్ దేశం యుద్ధం ప్రకటించింది. పొరుగు దేశంపై కాదు. ఉగ్రవాద సంస్థలపై అంతకన్నా కాదు. కానీ ఫ్రాన్స్ దేశం ఎవరి మీదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశానికి రాజైనా..హరవీర భయకంగా యుద్ధంచేసే వీరుడైనా మంచంపై పడుకుని హాయిగా నిద్రపోయే టైమ్ లో మంచంలో ఉండే నల్లి కుడితే ఉంటుందీ..కోపం నషాళానికి అంటుకుంటది..బంగారంలాంటి నిద్ర పాడు చేసిన ఆ బుడ్డి ప్రాణీ..అల్ప ప్రాణీని చంపేసేంత వరకూ కోపం చల్లారదు. అదిగో అంటువంటి ‘‘నల్లుల’’పై యుద్ధం ప్రకటించింది ఫ్రాన్స్ దేశం..!!

నల్లి పేరు చెబితే చాలా ఫ్రాన్స్ వాసులు హడలిపోతున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో నల్లుల బెడద బాగా పెరిగిపోయింది. దీంతో ఫ్రాన్స్ దేశం నల్లులపై సమర శంఖం పూరించింది. నల్లులు.. ప్యారిస్ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

ఈ సందర్భంగా ఫ్రాన్స్ గృహ నిర్మాణమంత్రిత్వ శాఖ స్పందిస్తూ..1950 దశాబ్దం తరువాత..నల్లలను శాశ్వతంగా తుదముట్టించామని తరువాత ఇన్నేళ్లకు మరోసారి నల్లుల బెడద పెరిగిందని తెలిపింది.  డీడీటీ విరివిగా వాడి దేశంలో వాటి నామరూపాలు లేకుండా చేసామనీ..తరువాత ఇంతకాలానికి కాలంలో డీడీటీ వాడకంపై నిషేధం విధించడంతో నల్లులు మెల్లగా తమ ఉనికిని చాటుకోవడం ప్రారంభించామని..తెలిపింది. కాగా..కంటే ఇప్పుడు 33 శాతం ఎక్కువగా ఉన్నాయని..హోటల్స్, అపార్ట్ మెంట్స్, ఇళ్లతో సహా 4 లక్షల ఇళ్లల్లో నల్లుల నిర్మూలకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రతీ ఇంటిలోను నల్లలు బెడద పెరిగిపోతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనీ వీటిని సమూలంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామంది.    

ఈ దేశీ నల్లులే కాకుండా విదేశీ ప్రయాణికుల ద్వారా పొరుగు దేశాల నల్లులు కూడా ఫ్రాన్స్ ‘పౌరసత్వం’ పుచ్చుకున్నట్లుగా పరిస్థితి ఉందనీ..ఫ్రాన్స్ దేశస్థులు వేరే దేశాలకు వెళ్లి..రావటంతో వారితో పాటు అవికూడా ప్రయాణం చేసిన ఫ్రాన్స్ పౌరసత్వం పుట్టున్నాయని దీంతో పరిస్థితి తీత్రతరమైందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నల్లలపై యుద్ధం ప్రకటించి వాటి నిర్మూలనకు రంగంలోకి దిగింది. 100 రోజుల ప్రణాలికను సిద్ధం చేసి..ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఓ ప్రత్యేక వెబ్ సైట్‌ను లాంచ్ చేసి ఎమర్జెన్సీ నెంబర్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.  ఏకంగా నల్లుల నిర్మూలన దళాలను కూడా ఏర్పాటు చేసిందీ అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. చిన్న ప్రాణీ..రెండు వేళ్లతో నలిపితే చచ్చిపోయే బుడ్డి జీవి దేశాన్నే గడగడలాడించేయటం విశేషం. అందుకే పెద్దలు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని అన్నారు. అదే చేస్తోంది ఫ్రాన్స్ ప్రభుత్వం.