France’s Macron: ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌కు అవమానం.. కరచాలనానికి వచ్చి చెంపదెబ్బ

ఫ్రాన్స్ ప్రెసిడెంట్.. ఇమాన్యుయెల్ మెక్రాన్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ముందుకెళ్లిన ఆయనకు చెంపదెబ్బతో అవమానం కలిగింది. వచ్చే ఏడాది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనున్న క్రమంలో పబ్లిక్ ఒపీనియన్ కోసం ...

France’s Macron: ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌కు అవమానం.. కరచాలనానికి వచ్చి చెంపదెబ్బ

France’s Macron

France’s Macron: ఫ్రాన్స్ ప్రెసిడెంట్.. ఇమాన్యుయెల్ మెక్రాన్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ముందుకెళ్లిన ఆయనకు చెంపదెబ్బతో అవమానం కలిగింది. వచ్చే ఏడాది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనున్న క్రమంలో పబ్లిక్ ఒపీనియన్ కోసం మెక్రాన్‌ దేశ వ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. వచ్చే 2 నెలల్లో 12 ప్రాంతాల్లో పర్యటించేందుకు రోడ్‌ మ్యాప్‌ రెడీ అయింది.

ఈ క్రమంలోనే రెండో పర్యటనలో భాగంగా ఆగ్నేయ ఫ్రాన్స్‌ ప్రాంతంలో టెయిన్‌-ఐ హెర్మిటేజ్‌ అనే చిన్న పట్టణానికి చేరుకున్న మెక్రాన్‌ ముందుగా హోటళ్లు, రెస్లారెంట్లలో పనిచేసే యూత్‌కు ట్రైనింగ్ ఇచ్చే హైస్కూల్‌ను సందర్శించారు. ఆ తర్వాత తాను రెస్ట్ తీసుకున్న బిల్డింగ్ బయట ఉన్న అభిమానులను, ప్రజలను కలిసేందుకు దగ్గరగా వెళ్లారు.

బారికేడ్లకు అవతలివైపు ఉన్న ఓ యువకుడు షేక్ హ్యాండ్ ఇచ్చేట్లుగా ముందుకొచ్చి చెంపపై కొట్టాడు. ఆ ఘటనతో ప్రెసిడెంట్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఇంతలో అక్కడున్న సెక్యూరిటీ వెనక్కి తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు ఫ్రెంచ్‌ టీవీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మెక్రాన్‌కు రాజకీయ నాయకుల నుంచి సానుభూతి వెలిబుచ్చుతున్నారు.