అల్-ఖైదా చీఫ్‌ని‌ మట్టుబెట్టిన బలగాలు

  • Published By: vamsi ,Published On : June 6, 2020 / 01:14 AM IST
అల్-ఖైదా చీఫ్‌ని‌ మట్టుబెట్టిన బలగాలు

ఫ్రాన్స్ దేశంలో మాలిలో జరిగిన ఆపరేషన్‌లో ఉత్తర ఆఫ్రికాలోని అల్-ఖైదా నాయకుడు అబ్దేల్‌మలేక్ డ్రౌక్‌డెల్‌ను చంపినట్లు ఫ్రాన్స్ వెల్లడించింది. ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెంచ్ సైనికదళాలు జరిపిన దాడిలో అల్ ఖైదా అధిపతి అబ్దేల్‌మలెక్ డ్రౌక్‌డెల్ హతమయ్యడని స్పష్టం చేశారు.

డ్రౌక్‌డెల్ కోసం ఫ్రెంచ్ సైనికులు ఏడేళ్లుగా వేటాడుతున్నారని, ఉగ్రవాద నాయకుడైన అబ్దేల్‌మలెక్ ఉత్తర అల్జీరియా పర్వతాల్లో దాక్కొని ఉత్తరమాలి, నైజర్, మౌరిటానియా, అల్జీరియా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవాడని చెప్పారు.

ఉత్తరమాలిలో అబ్దేల్‌మలెక్ డ్రౌక్‌డెల్ ఉండగా ఫ్రెంచ్ సైనికులు దాడి చేసి మట్టుబెట్టారని ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ చెప్పారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరియు జి 5 సహెల్ దేశాలు – బుర్కినా ఫాసో, చాడ్, మాలి, మౌరిటానియా మరియు నైజర్.. ఈ ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరాడుతున్నాయి. 

ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మాలి, అనేక మిలిటెంట్ గ్రూపుల ఉనికితో బాధపడుతోంది. ఇక్కడ ఫ్రెంచ్, మాలియన్ మరియు యుఎన్ శాంతిభద్రతలు కోసం తీవ్రవాద నిరోధక చర్యలను నిర్వహిస్తున్నారు.

Read: కరోనా వల్ల అమెరికా తీవ్రంగా ప్రభావితమైంది : ట్రంప్