Viral News: బోర్ కొట్టే జాబ్ ఇచ్చారంటూ కోర్టుకెక్కిన ఉద్యోగి: రూ.33 లక్షలు పరిహారం

ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎంతో విసుగు చెందానని, మానసికంగా నలిగిపోయానంటూ పని చేస్తున్న సంస్థపై కేసు వేసి $45,000 డాలర్ల పరిహారాన్ని రాబట్టాడు

Viral News: బోర్ కొట్టే జాబ్ ఇచ్చారంటూ కోర్టుకెక్కిన ఉద్యోగి: రూ.33 లక్షలు పరిహారం

Employee

Viral News: రోజూ ఒకే పని చేసి బోర్ కొడుతుంది. కానీ ఈ ఉద్యోగం తప్ప వేరే పని చేయలేం. ఏం చేస్తాం చచ్చినట్టు ఉన్న పని చేసుకుంటూ పోతాం. కానీ ఫ్రాన్స్ కు చెందిన ఫ్రెడెరిక్ డెస్నార్డ్ మాత్రం ఊరుకోలేదు. తనకు బోర్ కొట్టే పని అప్పజెప్పారంటు..ఉద్యోగం ఇచ్చిన సంస్థపైనే కేసు పెట్టాడు. అంతటితో ఆగలేదు..ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎంతో విసుగు చెందానని, మానసికంగా నలిగిపోయానంటూ పని చేస్తున్న సంస్థపై కేసు వేసి $45,000 డాలర్ల పరిహారాన్ని రాబట్టాడు. ఫ్రెడెరిక్ డెస్నార్డ్ అనే వ్యక్తి ఫ్రాన్స్ కు చెందిన పెర్ఫ్యూమ్ తయారీ కంపెనీ “ఇంటర్‌పార్ఫమ్స్”లో మేనేజర్ గా పనిచేసేవాడు.

Also read: Indian Army: గడ్డకట్టే మంచులో వాలీబాల్ ఆడుతున్న భారత సైనికులు

2014 వరకు మేనేజర్ గా పనిచేసిన డెస్నార్డ్ కు ఏడాదికి $80,000 డాలర్ల జీతం ఇచ్చింది ఆ సంస్థ. ఎదుగూబొదుగూ లేని ఆ ఉద్యోగం డెస్నార్డ్ కు ఒక నరకంలా ఉండేది. అయితే నాలుగేళ్ళ క్రితం.. అత్యంత విలువైన ఆర్డర్ పోగొట్టాడంటూ డెస్నార్డ్ ను మేనేజర్ బాధ్యతల నుంచి తప్పించింది “ఇంటర్‌పార్ఫమ్స్” యాజమాన్యం. గతంలోనూ తమ సంస్థపై డెస్నార్డ్ పలుమార్లు దావా వేసిన ఘటనలు దృష్టిలో ఉంచుకున్న యాజమాన్యం.. ఇప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తే మళ్లీ ఏ తంటా తెస్తాడోనని అతనితో చిన్నాచితకా పనులు చేయించింది.

Also read: Turkmenistan: “నరకానికి ప్రవేశ ద్వారం” మూసివేయండన్న దేశాధ్యక్షుడు

అయితే ఆ పనులు తన స్థాయికి తగినవి కాదని..”ఇంటర్‌పార్ఫమ్స్” యాజమాన్యం తనకు విసుగు పుట్టే ఉద్యోగం ఇచ్చిందంటూ డెస్నార్డ్ కోర్టుకెక్కాడు. ఆ పనులు చేయడం వలన “నిరాశ, నిస్పృహ మరియు అవమానానికి” గురైనట్లు కోర్టులో వాదించాడు. అంతే కాదు పని ఒత్తిడి తట్టుకోలేక ఒక రోజు డ్రైవింగ్ చేస్తూ మూర్ఛపోయినట్లు డెస్నార్డ్ లాయర్ కోర్టుకు తెలిపాడు. ఈ వాదనలు విన్న కోర్ట్ అతనికి పరిహారం ఇప్పించింది. కాగా.. బోర్ కొడుతుందంటూ ఉద్యోగం ఇచ్చిన సంస్థ నుంచి పరిహారం వసూలు చేయడం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.

Also read: Monkey Steal food: ఆహారం కోసం అపార్ట్మెంట్ 22 ఫ్లోర్ కు చేరుకున్న కోతి