Latest
ఫ్రెంచ్ బిలియనీర్ కన్నుమూత
ఓలివర్ మృతి పట్ల ఫ్రాన్స్ ప్రధాని మ ఇమ్మానుయేల్ మాక్రోన్ సంతాపం ప్రకటించారు. ఫ్రాన్స్ పార్లమెంటులో నివాళి అర్పించారు.
Home » International » ఫ్రెంచ్ బిలియనీర్ కన్నుమూత
ఓలివర్ మృతి పట్ల ఫ్రాన్స్ ప్రధాని మ ఇమ్మానుయేల్ మాక్రోన్ సంతాపం ప్రకటించారు. ఫ్రాన్స్ పార్లమెంటులో నివాళి అర్పించారు.
Publish Date - 2:54 pm, Mon, 8 March 21
French MP and billionaire : ఫ్రెంచ్ బిలియనీర్, దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ యజమాని, రాజకీయ నాయకుడు ఓలివర్ దసాల్ట్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఉత్తర ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ క్రాష్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఓలివర్ మృతి పట్ల ఫ్రాన్స్ ప్రధాని మ ఇమ్మానుయేల్ మాక్రోన్ సంతాపం ప్రకటించారు. ఫ్రాన్స్ పార్లమెంటులో నివాళి అర్పించారు. ఊపిరి ఉన్నంత వరకు దేశానికి ఓలివర్ సేవ చేశాడంటూ మాక్రోని కొనియాడారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు.
నార్మండీ ప్రాంతంలో ఓలివర్‌కి వేకేషన్ హౌస్ ఉంది. ప్రైవేటు చాపర్‌లో అక్కడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది, ఓలివర్‌తో పాటు పైలట్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏవియేషన్ రంగంలో దసాల్డ్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. యుద్ధ విమానాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. రాఫెల్ యుద్ద విమానాలను ఇండియా దసాల్ట్ కంపెనీ నుంచే కొనుగోలు చేస్తోంది. చనిపోయే సమయానికి సుమారు 8 బిలియన్ల ఆస్తిని కలిగి ఉన్నారు ఓలివర్.
అసోం మాజీ సీఎం భూమిధర్ బర్మన్ కన్నుమూత
MP naked on Zoom call : జూమ్ కాల్ లో పార్లమెంట్ సమావేశాలు..న్యూడ్ గా కనిపించిన ఎంపీ..
వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నాక కూడా కరోనా..ఛత్తీస్‌ఘడ్ హెల్త్ డైరక్టర్ మృతి
కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నుమూత
UP Accident : లోయలో పడిన ట్రక్..11మంది మృతి..
Corona : గుండెలు పిండే విషాదం.. కరోనాతో వ్యక్తి మృతి.. అందరూ ఉన్నా అనాథలా అంత్యక్రియలు