ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్​కు కరోనా

ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్​కు కరోనా

French President అమెరికా అధ్యక్షుడు ట్రంప్,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యక్షులు,ప్రభుతాధినేతలు కరోనా బారినపడిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చేరారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్​కు కరోనా వైరస్ సోకింది. ఈ మేరుకు గురువారం(డిసెంబర్-17,2020)ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది.

మొదటి కరోనా లక్షణం కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్​గా తేలినట్లు తెలిపింది. అయితే మేక్రాన్​కు మొదట బయటపడ్డ కరోనా లక్షణం ఏంటనే విషయంపై మాత్రం ఫ్రాన్స్ అధ్యక్ష భవనం స్పష్టత ఇవ్వలేదు. జాతీయ నిబంధనల ప్రకారం.. అధ్యక్షుడు మేక్రాన్ వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ యథావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని పేర్కొంది.

మరోవైపు,కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలను ఈ వారం ప్రారంభంలో ఫ్రాన్స్ ప్రభుత్వం సడలించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో కేసుల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించలేదు. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 17వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. క్రిస్మస్ నేపథ్యంలో ప్రజలు షాపింగ్,ట్రావెల్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇప్పటికే ఫ్రాన్స్ లో వైరస్ ని కట్టడిచేసేందుకు రాత్రి 8గంటల నుంచి ఓవర్ నైట్ కర్ఫ్యూని విధించారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ నేథ్యంలో రెస్టారెంట్లు,కేష్ లు,థియేటర్లు,సినిమా హాళ్లు అన్నీ మూసివేస్తున్నారు. ఇక, ఫ్రాన్స్ లో ఇప్పటివరకు 59వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. 24లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 18లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.