Latin American Artist : అరుదైన పెయింటింగ్..చాలా కాస్ట్ గురూ

ఓ కళాకారిణి స్వీయ చిత్రాన్ని తానే చిత్రీంచడమే కాకుండా..చిత్రంలో భర్త ముఖం తన నుదిటిపై ప్రతిబింబించేలా చిత్రిస్తుంది.

Frida Kahlo : పురాతమైన చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వీటిని దక్కించుకోవడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. విలక్షణమైన చిత్రాలకు వేలం పాటలో అత్యంత ఖరీదుకు అమ్ముడుపోతుంటాయి. ఓ కళాకారిణి స్వీయ చిత్రాన్ని తానే చిత్రీంచడమే కాకుండా..చిత్రంలో భర్త ముఖం తన నుదిటిపై ప్రతిబింబించేలా చిత్రిస్తుంది. న్యూయార్క్ వేలంలో దాదాపు రూ. 35 మిలియన్ డాలర్లకు (రూ. 260 కోట్లు) అమ్ముడుపోయింది చరిత్ర సృష్టించింది.

Read More : Madhyapradesh : రాక్షస తండ్రి, కూతురిపై హత్యాచారం

మెక్సికన్ దిగ్గజ కళాకారిణి..ఫ్రిదా కహ్లో అరుదైన పేయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్ లో ఆమె విలక్షణమైన కనుబొమ్మలతో చీకటి కళ్లపై నుంచి కొన్ని కన్నీటి చుక్కలు వస్తున్నట్లు చిత్రించారు. ఈ పెయింటింగ్ ను తన భర్త డియోగో వై యో పేరిట చిత్రీకరించారు. భర్త డియోగో రివెరా…మెక్సికన్ నటి ఫెలిక్స్ తో సన్నిహితంగా మెలిగాడని, దీంతో భర్త ముఖాన్ని తన నుదిపై మూడో కన్నుగా చిత్రీకరించాడని కళాకారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేయింటింగ్ వేలంలో అత్యంత ఖరీదుకు అమ్ముడుపోయిన లాటిన్ అమెరికా కళాకృతిగా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు