Love wrapped within hug..ప్రేమను కౌగిలింతలో చుట్టేసి ఇస్తే..ఇలా ఉంటుంది..!! Heart Touching Video

Love wrapped within hug..ప్రేమను కౌగిలింతలో చుట్టేసి ఇస్తే..ఇలా ఉంటుంది..!! Heart Touching Video

Love Wrapped Up Within A Hug

Friendly seal gives tight hug to scuba diver : కౌగిలింత..ప్రేమను వ్యక్తం చేసే ఓ చర్య. ఓ ఆత్మీయ స్పర్శ. అని చెప్పటంతో ఎటువంటి సందేహం లేదు. నేనున్నాననే ఓ భరోసా, ఓ ఆలంబన, ఓ ధైర్యం. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ‘‘జంతర్ మంతర్ జూమంతర్ కాళీ.. అందర్ దరద్ దెబ్బక్ ఖాళీ’’.. చెప్పినట్లు. కౌగిలింత అనేది కేవలం ఏ ఒక్కదానికో అనుకోకూడదు. లక్ష మాటలు చెప్పలేని భావాన్ని ఓ ‘కౌగిలింత’తో వ్యక్తంచేయొచ్చు.అటువంటి కౌగిలింత కేవలం మనుషుల మధ్యే కాదు మనిషికి జంతువులకు..పక్షులకు..ఈ సమస్త కోటి జీవరాశులకు వర్తిస్తుంది. అదిగో అటువంటిదో ఓ వ్యక్తి-సీల్‌ ‘ఆత్మీయ కౌగిలింత’..

జంతువులు కూడా అప్పుడప్పుడూ మన భాషలోనే మనపై ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. పెంపుడు జంతువులతో అటువంటి సందర్బాలు ఎన్నో ఉంటాయి జంతువులను పెంచుకున్నవారికి. అటవీ శాఖ అధికారి సుశాంత నంద దీన్ని ట్విటర్‌లో షేర్ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సముద్రంలో స్కూబా డైవింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి దగ్గరకు ఓ సీల్ వచ్చింది.అది అచ్చంగా మనిషిలాగే అతడిని కౌగిలించుకుంటుంది. స్కూబా డైవర్ కూడా ఆ సీల్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకునాడు. ఆలింగనం చేసుకుని ప్రేమగా దాని వీపుపై తడతాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అందరూ తెగ మురిసిపోతున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన సుశాంత నందా తన దైన శైలిలో చక్కటి కామెంట్ చేశారు. ప్రేమను కౌగిలింతలో చుట్టి ఇస్తే.. అంటూ క్యాప్షన్ జత చేశారు. 1.2 వేల లైకులతో తెగ వైరల్ అవుతున్న ఈ క్యూట్ వీడియోను మీరుకూడా చూసేయండీ..