Sri Lanka Crisis : లీటరు పెట్రోల్ దొరక్క రెండు రోజులు చిన్నారి మృతి

పొరుగు దేశం శ్రీలంక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆర్ధిక సంక్షోభంతో ఆహార పదార్ధాలను సైతం కొనుక్కోలేని పరిస్ధితిలో ప్రజలు అల్లాడి పోతున్నారు.

Sri Lanka Crisis : లీటరు పెట్రోల్ దొరక్క రెండు రోజులు చిన్నారి మృతి

Sri Lanka Crisis

Sri Lanka Crisis : పొరుగు దేశం శ్రీలంక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆర్ధిక సంక్షోభంతో ఆహార పదార్ధాలను సైతం కొనుక్కోలేని పరిస్ధితిలో ప్రజలు అల్లాడి పోతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుకు కొరత ఏర్పడింది.  శ్రీలంకలోని   సెంట్రల్ హైలాండ్స్ లో అంతకంటే ఘోరమైన  సంఘటన ఒకటి చోటు చేసుకుంది.  2 రోజుల చిన్నారిని ఆస్పత్రికి తీసుకు వెళ్లటానికి పెట్రోల్ దొరకక పోవటంతో చిన్నారి మరణించిన విషాద ఘటన జరిగింది.

హైలాండ్స్ లో నివసించే ఒక కుటుంబంలో రెండు రోజులు చిన్నారి ఉంది. ఆ పాపకు కామెర్లు వచ్చాయి. చిన్నారిని హల్దముల్లాలోని ఆస్పత్రికి తీసుకు  వెళ్లాల్సి ఉంది. కానీ ఆ చిన్నారి తండ్రి బైక్ లో పెట్రోల్ లేదు. ఆయన  పెట్రోల్ కోసం  తిరిగి తిరిగి  క్యూలైన్లలో నిలబడి  చివరికి  పెట్రోల్ సంపాదించాడు.  బైక్ పై చిన్నారిని హల్దముల్లాలోని దియతలవ హాస్పటల్ కు తీసుకు  వచ్చారు.

చిన్నారిని ఆస్పత్రిలోని  ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. కానీ అప్పటికే పరిస్ధితి చేయిజారి పోయి చిన్నారి మరణించింది. ఈ విషయాన్ని ఆస్పత్రికి చెందిన జ్యూడిషియల్ మెడికల్ ఆఫీసర్ శనకరోషన్  పతిరానా సోషల్ మీడియాలో వివరించారు.  లీటరు పెట్రోల్ దొరక్క పోవటంతో తమ బిడ్డను కాపాడుకోలేక పోయామన్న ఘటన ఆ కుటుంబాన్ని జీవితాంతం వేధిస్తూ  ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈరోజు జరుగుతున్న పరీక్షలకు విద్యార్ధులను పరీక్షా కేంద్రాల వద్ద దించేందుకు ప్రజలు మానవత్వంతో సహకరించాలని విద్యాశాఖ మంత్రి సుసిల్ ప్రేమ జయంత విజ్ఞప్తి చేశారు.