Vaccinated People : కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి..వైరస్ ముప్పు 3 రెట్లు తక్కువ

రోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్‌ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది.

Vaccinated People : కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి..వైరస్ ముప్పు 3 రెట్లు తక్కువ

Vaccine (1)

Vaccinated People కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్‌ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది. డెల్టా వేరియంట్‌ వంటి కొత్త రకాల నుంచి వ్యాక్సిన్ ద్వారా రక్షణ పొందవచ్చని తాజా పరిశోధనలో తేలింది.

లండన్‌ లోని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన పరిశోధకులు జూన్‌ 24 నుంచి జులై 12 మధ్య..కోవిడ్ వ్యాప్తి, వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా దాదాపు 98వేల మందిపై పరిశోధన చేశారు. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సగం మంది మాత్రమే వైరస్‌ బారినపడే ప్రమాదం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి 120మందిలో ఒకరికి వైరస్‌ సోకగా, వ్యాక్సిన్‌ తీసుకోని ప్రతి 40మందిలో ఒకరికి వైరస్‌ సోకుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వైరస్‌ ప్రాబల్యం 0.40శాతం, తీసుకోనివారిలో 1.21శాతం ఉందని తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారినపడిన బాధితుల్లో వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్‌ సోకినా ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందని తేల్చారు.

కరోనా లక్షణాలు కనిపించిన వారిలో వైరస్‌ను ఎదుర్కొనే సమర్థత 59 శాతం పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు. 254 పాజిటివ్‌ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేపట్టగా వాటిలో ఎక్కువగా డెల్టా వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇక, వ్యాక్సిన్‌ తీసుకోని యువకుల్లో ఇన్‌ఫెక్షన్లు, హాస్పిటల్స్ లో చేరికలకూ ఉన్న సంబంధాన్ని తాజా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. గతంలో వైరస్‌ సోకినవారికి డెల్టా వేరియంట్‌ తోడై మరోసారి వ్యాధిగ్రస్తులయ్యే ప్రమాదం ఉందని కనుగొన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు.