Japan’s Next PM : జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడా!

  లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు, జపాన్ మాజీ విదేశాంగ మంత్రి ఫుమియో కిషిడా జ‌పాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీక‌రించనున్నారు. అధికార పార్టీలో నిర్వహించిన

Japan’s Next PM : జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడా!

Japan

Japan’s Next PM  లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు, జపాన్ మాజీ విదేశాంగ మంత్రి ఫుమియో కిషిడా జ‌పాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీక‌రించనున్నారు. అధికార పార్టీలో నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా గెలుపొందారు. కాగా,కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవడం, దేశాన్ని న‌డిపించ‌లేక‌పోతున్నట్టు ఇటీవ‌ల ప్రస్తుత ప్రధాని సుగా ప్రకటించిన క్రమంలో కొత్త ప్రధాని ఎన్నిక తప్పని సరైంది.

ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ మంత్రిగా పనిచేస్తున్న టారో కోనో ప్రధాని అభ్యర్థిగా పోటీపడినప్పటికీ.. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికల్లో కిషిడానే విజయం వరించింది. అధికారిక పార్టీ ఓటింగ్‌లో కిషిడాకు 257 ఓట్లురాగా, కోనోకు 170 ఓట్లు దక్కాయి. దీంతో గతేడాది సెప్టెంబరులో ప్రధాని పగ్గాలు చేపట్టిన యొషిహిదే సుగా స్థానాన్ని.. కిషిడా భర్తీ చేయనున్నారు. సుగా కేవలం ఏడాదిలోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం జపాన్ పార్లమెంటులో ఎన్నిక జరగనుంది. అధికారపార్టీ అంతర్గత ఎన్నికల్లో గెలుపొందిన ఫుమియో..భాగస్వామ్య పక్షాల సహకారంతో.. పార్లమెంటులో ప్రధానిగా ఎన్నిక కావడం లాంఛనమేనని సమాచారం.

ALSO READ కాంగ్రెస్ కు బిగ్ షాక్..టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం

కాగా,కిషిడా హిరోషిమా రాజకీయ నాయకుల కుటుంబానికి చెందిన మృదు భాషి. బేస్ బాల్‌ అంటే ఇష్టం. గతంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పాలసీ చీఫ్‌గా పనిచేశారు. అలాగే 2012-17 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు, ఈ సమయంలో రష్యా ,దక్షిణ కొరియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాదు అణ్వాయుధాలను రద్దు చేయడమే తన జీవితాశయమని ప్రకటించారు.

గత 20 ఏళ్లుగా జపాన్ రాజకీయాలపై ఆధిపత్యం చలాయిస్తున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలనుంచి వైదొలగాలని, దేశంలో ఆదాయ అసమానతలను అధిగమిస్తామని ఫుమియో కిషిడా వాగ్దానం చేశారు. అంతేకాదు కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని కూడా కిషిడా హామీ ఇచ్చారు.

ALSO READ రాహుల్ ఉన్నంతకాలం బీజేపీకి ఇబ్బందే లేదు