ఇండియన్ మహిళలతో నేపాలీల సరోగసి వ్యాపారం.. పసిపిల్లల అమ్మకం

  • Published By: Subhan ,Published On : June 21, 2020 / 01:24 PM IST
ఇండియన్ మహిళలతో నేపాలీల సరోగసి వ్యాపారం.. పసిపిల్లల అమ్మకం

ఆగ్రా పోలీసులు పసిపిల్లలను అమ్మేస్తున్న స్మగ్లింగ్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులతో పాటు సరోగసి మోస్తున్న గర్భవతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ మెంబర్లతో పాటు ముగ్గురు పసి పిల్లలను రెస్క్యూ చేశారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో పోతున్న ఐదుగురు నిందితులు దొరికారు. రెస్క్యూ చేసిన పసిపిల్లలను చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీకి(సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. 

నిందితులను రాహుల్, నీలం, రూబీ, అమిత్ కుమార్, ప్రదీప్ కుమార్ లుగా గుర్తించారు. ఢిల్లీలోని హర్ష్ విహార్ లో రాహుల్, గిరిధ్వార్ ఎన్ క్లేవ్ లో నీలం, సరోగసి గర్భం మోస్తున్న మహిళ ఫరిదాబాద్ లో ఉంటుంది. అమిత్ కుమార్, ప్రదీప్ కుమార్ కూడా ఫరీదాబాద్ కు చెందిన వారే. 

ఢిల్లీ, యూపీ, బీహార్ నుంచి సరోగసీ కోసం నేపాల్ కు మహిళలను తీసుకెళ్లేవారు. అక్కడ పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి రూ.8నుంచి 9లక్షలు వసూలు చేసేవారు. ఇందులో సరోగసీ తల్లులకు రూ.3లక్షలు ఇచ్చేవారని ఎస్పీ కుమార్ వెల్లడించారు. 

నేపాల్ లో జరుగుతున్న ఈ వ్యాపారం మొత్తం అక్రమంగా జరుగుతున్నదే. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ గ్యాంగ్ ఫరీదాబాద్ కు వచ్చేసింది. వారి పనిలో భాగంగానే ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే మీద వెళ్తుండగా పట్టుకున్నారు. కారులో ఉన్న రూబీ అనే మహిళ తన సరోగసీ బిడ్డను వేరే గ్యాంగ్ కు ఇచ్చేసింది. వారు కస్టమర్ కు అప్పజెప్తారని చెప్తుంది. పిల్లలు ఎక్కడి వారో చెప్పలేకపోవడంతో వారందరినీ అనుమానిస్తూ అరెస్టు చేశారు.