వాళ్లకు ఫ్రిజ్ అవసరం లేదు…అయినా పండ్లు తాజాగా ఉంటాయి, ఎలా ?

వాళ్లకు ఫ్రిజ్ అవసరం లేదు…అయినా పండ్లు తాజాగా ఉంటాయి, ఎలా ?

Keeping Fruits With Traditional Method : పండ్లు, కూరగాయాలు, ఇతరత్రా తాజాగా ఉండాలంటే..ఎందులో పెడుతాం. ఫ్రిజ్ లో కదా. తాజాగా ఉండేందుకు తప్పనిసరిగా..ఫ్రిజ్ ను ఉపయోగిస్తుంటాం. వ్యాపారం చేసే వారు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేస్తుంటారు. అయితే…ఓ ప్రాంత వాసులు మాత్రం…ఫ్రిజ్ ను అసలు వాడరు. అయినా..పండ్లు తాజాగా ఉంటాయి. ద్రాక్ష వంటి పండ్లను ఏకంగా ఆరు నెలల పాటు చెక్కు చెదరకుండా..నిల్వ చేస్తుంటారు. ఫ్రిజ్, కోల్డ్ స్టోరేజీ లేకుండా..నిల్వ చేయడమా…ఇంపాజబుల్. అంటారు కదా..కానీ..నిజం..ఇది

అప్ఘనిస్తాన్ లో పురాతన సంప్రదాయ పద్ధతినే నేటికి వాడుతుండడం విశేషం. పండ్లు నిల్వ చేసేందుకు ఏమాత్రం ఫ్రిజ్ వాడరు. మరి ఎలా నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియనే ‘గాంగినా’ అంటారు. ఇందులో పండ్లు నిల్వ చేస్తే..దాదాపు ఆరు నెలల పాటు తాజాదానం చెక్కుచెదరకుండా ఉంటాయంట. తడి బంకమట్టితో బుట్టల్లా తయారు చేస్తారు. గాలి చొరబడకుండా..గట్టిగా వాటి మూతను మూసివేస్తారు. అవి పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో ఆరబెడుతారు. ఇలా ఎండిన బుట్టల్లో తాజా పండ్లను ఉంచి..చీకటి గదుల్లో భద్రపరుస్తారు.

Gangina

పండ్ల దిగుబడి లేని రుతువులో ఈ ‘గాంగినా’ బుట్టలను తెరిచి..ఇందులోని పండ్లను వాడుకుంటారు. వీటి అడుగు భాగాన్ని, పై మూతను రెండేసి పోరలుగా మట్టితో తయారు చేయడం వల్ల…వీటిలో భద్రపరిచిన..పండ్లు తాజాగా ఉంటాయని అంటుంటారు. వీటిలో పండ్లను నిల్వ చేసేటప్పుడు, ముందుగా..అతిగా మగ్గిన..వాటిని, కుళ్లిన వాటిని వేరు చేస్తామని రైతులు వెల్లడిస్తున్నారు. ఇలా చేయకుంటే…తాజాగా ఉన్న పండ్లు పాడైపోతాయని తెలిపారు.