నియాండర్తల్స్ మానవులలో కరోనా వైరస్ మూలం?

  • Published By: vamsi ,Published On : July 7, 2020 / 10:50 AM IST
నియాండర్తల్స్ మానవులలో కరోనా వైరస్ మూలం?

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని పనితీరును స్తంభింపజేసింది. ప్రపంచాన్ని నిశ్చల స్థితికి తీసుకువచ్చిన ఏకైక వ్యాధి ఇది. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా వ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని ఏ వైద్యుడు, శాస్త్రవేత్త, పరిశోధకుడు కనుగొనలేకపోయారు.

అయితే ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. కోవిడ్ -19తో లింక్‌ ఉన్న డీఎన్‌ఏ విస్తీర్ణం 60వేల సంవత్సరాల క్రితం నియాండర్తల్స్ మానవుల నుంచి పంపబడిందని ఒక అధ్యయనం కనుగొంది. అయితే కోవిడ్‌పై పరిశోధనలు చేస్తున్న ప్రత్యేక విభాగం శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలియదు.

న్యూయార్క్ టైమ్స్‌తో అధ్యయనంలో పాల్గొనని ప్రిన్స్‌స్టన్ విశ్వవిద్యాలయంలోని జన్యు శాస్త్రవేత్త జాషువా అకీ మాట్లాడుతూ.. 60వేల ఏళ్ల క్రితం జరిగిన ఈ సంతానోత్పత్తి ప్రభావం నేటికీ ప్రభావం చూపుతోందని అన్నారు. అయితే ఈ జీన్‌ స్పాన్‌కు సంబంధించిన మానవ చరిత్ర అస్పష్టంగా ఉందని, నియాండెర్తల్‌ మానువుని క్రోమోజోమ్ 3లో ఆరు జన్యువులున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

బంగ్లాదేశ్‌లో 63 శాతం మంది ప్రజలు కనీసం ఈ జన్యువుకు సంబంధించిన ఒక కాపీని కలిగి ఉన్నట్లుగా అధ్యయనం చెప్పింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల విషయానికొస్తే, మానవులలో ఈ జన్యువు అంతగా లేదని గుర్తించింది. కేవలం 8శాతం మంది యురోపియన్లు, నాలుగు శాతం మంది తూర్పు ఆసియన్లలో మాత్రమే జన్యువు ఉన్నట్లు చెప్పింది. ఇక మహిళలతో పోలిస్తే వృద్ధులకు ఎందుకు ఎక్కువ ముప్పు, లేదా పురుషులకు ఎందుకు ఎక్కువ ప్రమాదం అనే విషయాలపై వారు పరిశోధనలు చేస్తున్నారు.

Read Here>>ఏడాది మొత్తం ఆన్‌లైన్ క్లాసులేనా.. జులై 15న ఏం తేలనుంది?