Snakes In House : ఇంట్లో వేలాడుతున్న పాములు..అద్దె కట్టేదాకా తీయించేది లేదన్న యజమాని

ఇంట్లో పాములు వేలాడుతున్నాయి సార్..అని అద్దెకుంటే వ్యక్తి చెబితే..ముందు ఇంటి అద్దె బకాయి కట్టు తరువాత వాటి సంగతి చూద్దాం..అంటూ అదో పెద్ద విషయం కాదన్నట్లుగా తాపీగా సమాధానం చెప్పాడు ఇంటి యజమాని.

Snakes In House : ఇంట్లో వేలాడుతున్న పాములు..అద్దె కట్టేదాకా తీయించేది లేదన్న యజమాని

Snakes Fall In House

Snakes fall In House : అద్దెకున్న ఇంగ్లో ట్యాప్ లీక్స్ అయినా..మరేదన్నా రిపేర్లు ఉంటే ఇంటి యజమానికి చెబుతాం. దాంతో ఇంటి యజమాని ఆ రిపేర్లు చేయిస్తుంటాడు. ఇది మామూలే. కానీ ఓ ఇంటి ఓనర్ మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. ‘సార్..ఇంటిలో పాములున్నాయి..ఇంటి కప్పుకు పాములు వేలాడుతున్నాయి. భయంగా ఉంది..అని వాపోయాడు ఇంటిలో అద్దెకుండే వ్యక్తి. దానికి ఆ ఇంటి ఓనర్ ఏమన్నాడంటే..‘హా అవునా..ఇంటిలో పాములున్నాయా? అయితే ఏం చేయాలి? నువ్వా అద్దె బాకీ కట్టవు..కానీ కంప్లైంట్లు మాత్రం చేస్తావు..ముందు ఇంటి అద్దె బాకీ మొత్తం కట్టు అప్పుడు పాములను ఇంట్లోంచి తీయిస్తాను అని తాపీగా సమాధానం చెప్పాడు. ఆ మాట విన్న అద్దెకుండే వ్యక్తి షాక్ అయ్యాడు. పాములున్నాయని చెబితే షాక్ అవ్వకుండా ఇంకా ఎదురు నాకు షాకులిస్తున్నాడేంటీ అంటూ ఆశ్చర్యపోయాడు. ఈ వింత ఘటన జార్జియాలో జరిగింది.

హ్యారీ పగ్లీస్ అనే వ్యక్తి జార్జియాలోని టిబిలిసిలో ఓ ఇంట్లో భార్యా పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు పెచ్చులూడిపోయాయి. ఎప్పుడు పడిపోతాయా? అన్నట్లుగా ఉన్నాయి. వాటిని చూసి భార్యాభర్తలిద్దరూ పిల్లల మీద ఆ పెచ్చులు ఎక్కడ ఊడిపడతాయోనని భయపడేవారు. కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపడ్డాయి కూడా.

దీనికి తోడు పెచ్చులు ఊడిపోయిన ప్రాంతంలోంచి పాములు బాధొకటి. ఊడిపోయిన పెచ్చుల్లోంచి పాములు ఇంటిలోపలికి వేలాడుతున్నాయి. సీలింగ్ లో ఉన్న ఎలుకల్ని తినటానికి పాములు వచ్చాయి. వాటిని చూసిన హ్యారీ దంపతులు హడలిపోయారు. దీంతో హ్యారీ ఇంటి ఓనర్ వద్దకు పరిగెత్తాడు. జరిగిన విషయం చెప్పాడు. వెంటనే పాములను తీయించమని మొరపెట్టుకున్నాడు. దానికి ఆ యజమానురాలు.. `నువ్వు రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. ముందు అద్దె కట్టు. తర్వాత పాములు తీయించేస్తాను’ అంటూ తాపీగా సమాధానం ఇచ్చింది. దీంతో షాకైన హ్యారీ పాములు ఉన్న ఆ ఇంట్లోనే భయంభయంగా రెండ్రోజులు గడిపానని స్థానిక మీడియా ద్వారా వాపోయాడు.