కరోనా అనుమానంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కు దేశాధినేత

కరోనా అనుమానంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కు దేశాధినేత

కరోనా అనుమానంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కు దేశాధినేత

జర్మనీ చాన్సిలర్‌ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఆదివారం ఆమె ఈ నిర్ణయంత తీసుకున్నారు. లక్షణాలు బయటపడకపోయినా అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం న్యూమొకోకస్‌ బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్‌ ఎక్కించిన వైద్యుడికి కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. 

మెర్కెల్‌కు రోజూ వైద్య పరీక్షలు నిర్వహించుతున్నట్లు అధికార బృందం తెలిపింది. సోమవారం మీటింగ్ ఏర్పాటు చేసి కరోనా మహమ్మారిని అరికట్టడానికి 160బిలియన్ డాలర్ల కేటాయింపుపై చర్చించాల్సి ఉంది. చాన్సిలర్ మహమ్మారి భయంతో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవడంతో పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తుంది. 

ప్రస్తుతానికి ఇంటి దగ్గరి నుంచే విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికైతే ఆమెకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని, ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు వెల్లడించారు. జర్మనీలో వేగవంతంగా వైరస్‌ సంక్రమిస్తుండటంతో ప్రజలు గుమిగూడడంపై పూర్తిగా నిషేధం విధించారు. ఇద్దరికి మించి వ్యక్తులెవరూ ఒక చోటు ఉండడానికి వీల్లేదు. 

రెస్టారెంట్లు, ఫుడ్ సర్వీసులు ఓపెన్ చేసినప్పటికీ డెలీవరీ సర్వీసులు మాత్రమే పనిచేస్తున్నాయి. పనులు చేసుకోవడానికి, డాక్టర్లను కలిసేందుకు ప్రజలకు పూర్తి అనుమతులు ఉన్నాయి. బయట తిరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా 4అడుగుల దూరం మెయింటైన్ చేయాలని ఆంక్షలు విధించారు. 

ప్రపంచ వ్యాప్తంగా జర్మనీకి మించి ఏ దేశం ప్రజలు గుమిగూడటాన్ని నియంత్రించలేకపోతుంది. అమెరికా ప్రభుత్వం 10మంది కంటే ఎక్కువ ఎక్కడా ఉండకూడదని నిర్దేశించింది. స్విట్జర్లాండ్ ఐదుగురు మించకూడదంటే, ఇటలీ, స్పెయిన్ లు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని చెబుతున్నాయి. 

See Also | Queen Elizabeth IIకు కరోనా.. ప్యాలెస్ నుంచి బయటకే

×