Angela Merkel: ఫస్ట్ డోసు ఆస్ట్రాజెనెకా.. సెకండ్ డోసుగా మోడర్నా తీసుకున్న ఏంజెలా మెర్కెల్

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండు వేరువేరు రకాల వ్యాక్సిన్‌లను తీసుకున్నారు. ఏప్రిల్‌లో తన మొదటి డోసు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తీసుకోగా.. సెకండ్ డోసును జూన్ 22వ తేదీన ఆమె మోడర్నా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

Angela Merkel: ఫస్ట్ డోసు ఆస్ట్రాజెనెకా.. సెకండ్ డోసుగా మోడర్నా తీసుకున్న ఏంజెలా మెర్కెల్

Germany’s Angela Merkel

Moderna, AstraZeneca Vaccination: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండు వేరువేరు రకాల వ్యాక్సిన్‌లను తీసుకున్నారు. ఏంజెలా మెర్కెల్ ఏప్రిల్‌లో తన మొదటి డోసు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తీసుకోగా.. జూన్ 22వ తేదీన సెకండ్ డోసుగా మోడర్నా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని మెర్కెల్ కార్యాలయం నుంచి అధికార ప్రతినిధి వెల్లడించారు.

66 ఏళ్ల ఏంజెలా మెర్కెల్ ఏప్రిల్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు రకాల వ్యాక్సిన్‌లను తీసుకున్నారు. జర్మనీ అధికారులు 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే రెండు రకాల వ్యాక్సిన్‌లను ఉపయోగించుకోవచ్చునని సిఫారసు చేసింది. రెండు వారాల గ్యాప్ తర్వాత మాత్రమే వ్యాక్సిన్‌లను వేయించుకోవలసి ఉంటుంది.

ఇదిలా ఉంటే, 16 సంవత్సరాలు అధికారంలో ఉన్న మెర్కెల్ ఈ ఏడాది పదవీవిరమణ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో ఆమె ఈమేరకు పదవి నుంచి దిగిపోనున్నారు. 2019లో, ఆమె బహిరంగంగా వణుకుతూ కనిపించగా.. ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కానీ అప్పటి నుంచి మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. ఇక మంగళవారం నాటికి, జర్మనీ జనాభాలో ఇద్దరిలో ఒకరు లేదా 51.2 శాతం మంది వ్యాక్సిన్ ఫస్ట్ డోసును వేయించుకున్నారు.