Space Ride : బెలూన్‌లో స్పేస్ సవారీ.. ధర రూ.93లక్షలు, కేవలం 8మందికే చాన్స్…

మీరు అంతరిక్షంలో షికారు చేయాలని అనుకుంటున్నారా? స్పేస్ అందాలు చూసి ఆనందించాలని అనుకుంటున్నారా? త్వరలోనే మీ కోరిక నెరవేరనుంది. అయితే ఇందుకు అయ్యే ఖర్చు అక్షరాల రూ.93లక్షలు మాత్రమే.

Space Ride : బెలూన్‌లో స్పేస్ సవారీ.. ధర రూ.93లక్షలు, కేవలం 8మందికే చాన్స్…

Space Ride

Space Ride : మీరు అంతరిక్షంలో షికారు చేయాలని అనుకుంటున్నారా? స్పేస్ అందాలు చూసి ఆనందించాలని అనుకుంటున్నారా? త్వరలోనే మీ కోరిక నెరవేరనుంది. అయితే ఇందుకు అయ్యే ఖర్చు అక్షరాల రూ.93లక్షలు మాత్రమే. ఫ్లోరిడాలోని ఓ టూరిజం సంస్థ స్పేస్‌ బెలూన్‌ సవారీకి ప్లాన్ చేస్తోంది. కేవలం రెండు గంటల్లోనే సుమారు లక్ష అడుగుల ఎత్తుకు తీసుకెళ్లగలదు. మరో రెండు గంటలు అంతరిక్ష అందాలను వీక్షించి, ఆస్వాదించొచ్చు. తిరిగి నేలకు చేరడానికి మరో రెండు గంటలు. మొత్తం ఆరు గంటల ప్రయాణం. కాగా, ఈ బెలూన్ లో కేవలం ఎనిమిది మందికి మాత్రమే చోటు ఉంటుంది.

అయితే, హైడ్రోజన్‌ బెలూన్‌ అంతపైకి ఎలా వెళ్లగలదనే సందేహం మీకు రావొచ్చు. ‘నాసా’ ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయాణ నిపుణులు వివిధ ప్రయోగాలు చేసి అతి తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాన్ని రూపొందించారు. అది గురత్వాక్షరణ శక్తిని అధిగమించి అంతరిక్ష ప్రయాణానికి అనుకూలిస్తుంది. ఈ పద్ధతి ఉపయోగించే తాజాగా.. ఫ్లోరిడాలోని సంస్థ అంతరిక్షంలోకి విమాన ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విమానం మాదిరే ఈ బెలూన్‌ను నడిపేందుకూ ఒక స్పేస్‌ పైలట్, ఒక కో పైలట్‌ ఉంటారు. ప్రయాణికులు అంతరిక్ష సవారీని ఆస్వాదించడమే కాదు ఆ మధుర క్షణాలను బెలూన్‌ పారదర్శక గోడల నుంచి తమ ఫోన్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు.

ఈ సవారీలో ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని కూడా టూరిజం సంస్థే సప్లయ్ చేస్తుంది. ఇక ఈ బెలూన్‌లో ఒక కిచెన్, బార్, బాత్‌రూమ్‌ కూడా ఉండటం విశేషం. కాగా, స్పేస్ సవారీ చేయాలంటే ముందుగా రూ.93లక్షలు చెల్లించి సీటు రిజర్వ్ చేసుకోవాలి. 2024 వరకు ఆగాల్సిందే.