క్రిస్మస్ రోజున భూమిపైకి వేగంగా దూసుకొస్తున్న అతిపెద్ద గ్రహశకలం

క్రిస్మస్ రోజున భూమిపైకి వేగంగా దూసుకొస్తున్న అతిపెద్ద గ్రహశకలం

Christmas Day 2020 Giant asteroid to Earth : 2020 ఏడాది ప్రపంచానికి కష్ట కాలంగా మారింది. కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచానికి మరో ముప్పు ఆస్టరాయిడ్ రూపంలో రాబోతోందనే భయాందోళన నెలకొంది. రెండు ఫుట్ బాల్ స్టేడియంల అంత పరిమాణం ఉన్న ఓ అతిపెద్ద అంతరిక్ష ఉల్క (ఆస్టరాయిడ్) భూమికి దగ్గరగా దూసుకోస్తోంది. అది కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన భూమిపైకి దూసుకొస్తోంది. 501647 (2014 SD224) అంతరిక్ష ఉల్క (రాక్) భూమికి చేరువగా రాబోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) వెల్లడించింది. ఈ ఆస్ట్రరాయిడ్ గమనంపై నాసా పరిశోధకులు ఒక కన్నేసి ఉంచారు. క్రిస్మస్ రోజున భూమిపైకి దూసుకొచ్చే ఒక పెద్ద ఉల్కపై నాసా నిఘా పెట్టింది. టెలిస్కోపుల ద్వారా ఆస్ట్రరాయిడ్ గమనాన్ని నాసా సైంటిస్టులు ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నారు.

క్రిస్మస్ రోజున భూమికి 689 అడుగుల వెడల్పు ఉంటుందని అంటున్నారు. ఈ ఉల్క రెండు ఫుట్ బాల్ మైదానాలు ఉన్నంత విశాలంగా చాలా పెద్దదిగా ఉంటుందని నాసా చెబుతోంది.ఆస్టరాయిడ్ 501647 (2014 ఎస్‌డి 224) సుమారు 22,000mph వేగంతో ప్రయాణిస్తోంది. అంతేకాదు.. ఈ అతి పెద్ద ఉల్క.. భూమికి 1.9 మిలియన్ల మైళ్ల దూరంలో వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ ఉల్క వైశాల్యం అతిపెద్దదిగా ఉంటుందని అంటున్నారు.
Giant asteroid set on Christmas Day4.65 మిలియన్ మైళ్ల పరిధిలో ఏదైనా వేగంగా దూసుకొచ్చే అంతరిక్ష వస్తువును అంతరిక్ష సంస్థలు ప్రమాదకరంగా భావిస్తాయి. ఈ అతిపెద్ద ఉల్క మధ్యాహ్నం 3:20 గంటలకు (ET)కి దగ్గరగా ఉంటుంది. NASA క్లోజ్ అప్రోచ్ టేబుల్ ప్రకారం.. చాలా చిన్న ఉల్క 2020 XY కూడా ఇదే రోజున వేగంగా దూసుకొస్తుందని నాసా పేర్కొంది. అయితే ఈ గ్రహశకలం 144 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ చాలా దూరంగా ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. భూమి నుండి 3.6 మిలియన్ మైళ్ల దూరంలో దూసుకొస్తోందని నాసా భావిస్తోంది.