violence In Work plaaces : ప‌ని ప్ర‌దేశాల్లో పెరిగిన హింస‌, వేధింపులు ..బాధితుల్లో ఎక్కువమంది మగవారే : స‌ర్వేలో షాకింగ్ నిజాలు

పని ప్రదేశాల్లో శారీర‌క‌, లైంగిక వేధింపులు జరిగాయని..జరుగుతున్నాయని తెలుసు. కానీ ఈ వేధింపులు శారీరకంగానే కాదు మానసిక వేధింపులు, హింస జరుగుతోంది అని గ్లోబ‌ల్ స‌ర్వే వెల్ల‌డించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడల్లాయి. ఇటువంటి వేధింపులకు గురి అయ్యేవారు మహిళలు మాత్రమే అనుకున్నాం. కానీ పని ప్రదేశాల్లో మగవారు కూడా వేధింపులు,హింసకు గురి అవుతున్నారని ఈ సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ప‌ని ప్ర‌దేశాల్లో మాన‌సిక హింస‌, వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని గ్లోబ‌ల్ స‌ర్వే వెల్ల‌డించింది.

 violence In Work plaaces :  ప‌ని ప్ర‌దేశాల్లో పెరిగిన హింస‌, వేధింపులు ..బాధితుల్లో ఎక్కువమంది మగవారే :  స‌ర్వేలో షాకింగ్ నిజాలు

global survey report workplace violence harassment

violence In Work plaaces : పని ప్రదేశాల్లో శారీర‌క‌, లైంగిక వేధింపులు జరిగాయని..జరుగుతున్నాయని తెలుసు. కానీ ఈ వేధింపులు శారీరకంగానే కాదు మానసిక వేధింపులు, హింస జరుగుతోంది అని గ్లోబ‌ల్ స‌ర్వే వెల్ల‌డించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడల్లాయి. ఇటువంటి వేధింపులకు గురి అయ్యేవారు మహిళలు మాత్రమే అనుకున్నాం. కానీ పని ప్రదేశాల్లో మగవారు కూడా వేధింపులు,హింసకు గురి అవుతున్నారని ఈ సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ప‌ని ప్ర‌దేశాల్లో మాన‌సిక హింస‌, వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని గ్లోబ‌ల్ స‌ర్వే వెల్ల‌డించింది.

ఈ స‌ర్వే వివ‌రాల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ, ల‌ల్లాయిడ్ రైట్స్ ఫౌండేష‌న్‌, గాల్ల‌ప్ సంస్థ‌ సోమ‌వారం (డిసెంబర్ 5,2022) 56 పేజీల నివేదికను విడుదల చేశాయి. అసంఘటిత రంగంలోనే కాకుండా సంఘటిత రంగాల్లో కూడా ఈ మధ్యకాలంలో వేధింపులు, మాన‌సిక హింస శాతం ఎక్కువ‌ని ఈస‌ర్వేలో వెల్లడైంది. మ‌హిళా ఉద్యోగులు మాత్ర‌మే కాదు మ‌గ‌వాళ్లు కూడా ఈ స‌మ‌స్య ఎదుర్కొన్న‌ట్టు తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాలలో దాదాపు 75,000 మంది కార్మికులలో 22% మంది హింస లేదా వేధింపులను అనుభవించినట్లుగా తేలింది.

ప్ర‌పంచవ్యాప్తంగా 17.9 శాతం మంది ఉద్యోగులు మాన‌సిక‌ హింస‌కు గుర‌య్యామ‌ని వెల్ల‌డించారు. 8.5శాతం మంది తాము పని ప్ర‌దేశంలో శారీర‌క హింస‌ను అనుభ‌వించామ‌ని, 6.3 శాతం మంది లైగింక వేదింపుల బారిన ప‌డ్డ‌ట్టు చెప్పుకొచ్చారు బాధిత ఉద్యోగులు.ఆఫీసులో, కంపెనీలో చాలాసార్లు మానసిక వేధింపులు ఎదుర్కొన్నామ‌ని, మాన‌సిక హింస‌కు గురి అయి దాదాపు ఐదేళ్లు కావొస్తుంది అని మాన‌సిక వేధింపుకుల గురైన‌వాళ్ల‌లో దాదాపు 60 శాతం మంది చెప్పారు.

2021లో 121 దేశాల్లో సైక‌లాజిక‌ల్ వ‌యొలెన్స్ గురించి 75,000 మందిపై స‌ర్వే చేశారు. దాదాపు 22 శాతం మంది ఏదో ఒక రూపంలో హింస‌కు గురైన‌ట్టుగా వెల్లడించారు. కార్యాలయాలు, ఆయా పని ప్రదేశాల్లో చాలాసార్లు మానసిక వేధింపులు ఎదుర్కొన్నామ‌ని, 6.3 శాతం మంది మాన‌సిక హింస‌,లైంగిక హింసలకు, లైంగిక వేధింపులకుకు గురి అయ్యామని తెలిపారు.

మానసిక హింస, వేధింపులు అత్యంత సాధారణమయ్యాయని పురుషులు, మహిళలు ఇద్దరు తెలిపారు.17.9శాతం మంది ప్రతీరోజూ ఏదోక సమయంలో వేధింపులను ఎదుర్కొన్నామని తెలిపారు. సర్వేలో పాల్గొన్నవారిలో 8.5శాతం మంది శారీరక హింస, వేధింపులు ఎదర్కొన్నామని తెలుపగా వీరిలో మహిళల కంటే మగవారే ఎక్కుమంది ఉన్నారని నివేదిక పేర్కొంది.6.3శాతం మంది లైంగిక వేధింపులకు అనుభవించగా వారిలో 8.2శాతం మంది మహిళలు ఉండగా వారిలో ఎక్కువ మంది పురుషులే కావటం గమనించాల్సిన విషయం.

‘ప‌నిప్ర‌దేశాల్లో మాన‌సిక హింస అనేది చాలా ప్ర‌మాద‌క‌రం. దీనివ‌ల్ల చాలా దుష్ప‌రిణామాలు ఉన్నాయి. చాలామంది ఉద్యోగుల మాన‌సిక, శారీర‌క‌ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. అంతేకాదు వాళ్ల కెరీర్ దెబ్బతింటుంది. ఫ‌లితంగా ఆర్థికంగా ఇబ్బందులు
ఎదుర్కొంటారు’ అని యూఎన్ లేబ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ తెలిపింది. ప‌ని ప్ర‌దేశాల్లో సైక‌లాజిక‌ల్ వ‌యొలెన్స్, హ‌రాస్‌మెంట్ మీద ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్ట‌డీ చేయ‌డం ఇదే మొద‌టిసారి కావటం విశేషం.