Goblin Mode: ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘గోబ్లిన్ మోడ్’.. అంటే అర్థం తెలుసా?

ఈ ఏడాది ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్‌’గా నిలిచింది ‘గోబ్లిన్ మోడ్’. ప్రముఖ డిక్షనరీ సంస్థ ఆక్స్‌ఫర్డ్ ఈ పదాన్ని ఎంపకి చేసింది. ఆన్‌లైన్ సర్వే ద్వారా ఈ పదాన్ని ఎంపిక చేసి, ప్రకటించింది.

Goblin Mode: ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘గోబ్లిన్ మోడ్’.. అంటే అర్థం తెలుసా?

Goblin Mode: ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్‌-2022’గా ‘గోబ్లిన్ మోడ్’ను ఎంపిక చేసింది ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సంస్థ. ప్రతి సంవత్సరం కొత్తగా ప్రాచుర్యం పొందిన పదాన్ని ఆ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటిస్తుంది ఆక్స్‌ఫర్డ్. దీని ప్రకారం ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన పదంగా నిలిచింది ‘గోబ్లిన్ మోడ్’.

Elon Musk: ఎలన్ మస్క్‌కు ఎదురుదెబ్బ.. న్యూరాలింక్ సంస్థపై అమెరికా విచారణ.. కారణమేంటి?

ఆక్స్‌ఫర్డ్ సంస్థ ఆన్‌లైన్ సర్వే నిర్వహించి ఈ పదాన్ని ఎంపిక చేసింది. సోమరితనం, మందబుద్ధి, అత్యాశ కలిగి ఉండి, సమాజం అంగీకరించని, అంచనాలకు అందని ప్రవర్తన కలిగి ఉండటాన్ని ‘గోబ్లిన్ మోడ్’ అనే పదం సూచిస్తుంది. రెండు వారాలపాటు సాగిన ఈ ఓటింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,00,000 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, సోషల్ మీడియాలో ‘గోబ్లిన్ మోడ్’ పదం బాగా ప్రచారం పొంది, వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఈ పదాన్ని పత్రికలు, మ్యాగజైన్లు, మీడియా వాడటం మొదలుపెట్టింది. దీంతో ఈ పదం ఈ ఏడాది మరింత ప్రజాదరణ పొందింది.

PM MODI: వైఎస్.షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. అరెస్టు వ్యవహారంపై ఆరా

అయితే, ఇది అంతకుముందు కోవిడ్ సమయంలో కూడా వైరల్ అయింది. కానీ, ఈ ఏడాది మరింత పాపులర్ అయింది. ఇక, ఈ ఏడాదికి సంబంధించి మూడు పదాలను ఆక్స్‌ఫర్డ్ ఎంపిక చేసింది. అవి… మెటావర్స్, #ఐస్టాండ్‌విత్, గోబ్లిన్ మోడ్. ఈ మూడింటికీ పోటీ నిర్వహిస్తే అత్యధిక శాతం ఓట్లతో ‘గోబ్లిన్ మోడ్’ పదం విజయం సాధించింది.