Goldfish : వండర్ ఫుల్.. వైకల్యంతో బాధపడుతున్న చేపకు స్పెషల్ జాకెట్ చేయించిన మహిళ, ఇప్పుడు చక్కగా ఈదుతోంది

చేప పిల్లకు ఈత నేర్పవలెనా.. అనే సామెత వినే ఉంటారు. అంటే.. బయ్ బర్త్.. చేప పిల్లకు సహజంగానే ఈత వస్తుంది. దానికి ప్రత్యేకించి నేర్పవలసిన పని లేదు. కానీ,

Goldfish : వండర్ ఫుల్.. వైకల్యంతో బాధపడుతున్న చేపకు స్పెషల్ జాకెట్ చేయించిన మహిళ, ఇప్పుడు చక్కగా ఈదుతోంది

Goldfish Special Jacket

Goldfish Special Jacket : చేప పిల్లకు ఈత నేర్పవలెనా.. అనే సామెత వినే ఉంటారు. అంటే.. బయ్ బర్త్.. చేప పిల్లకు సహజంగానే ఈత వస్తుంది. దానికి ప్రత్యేకించి నేర్పవలసిన పని లేదు. పుట్టుకతోనే “ఈదే” లక్షణాలను, సమర్ధతను కలిగి ఉంటుంది. అయితే ఈ చేప మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అదో గోల్డ్ ఫిష్. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ, దానికి పెద్ద కష్టమే వచ్చి పడింది. అదేమిటంటే, ఆ చేప ఈదలేదు.

ఈ విషయాన్ని గుర్తించిన ఓ మహిళ తీవ్ర ఆవేదనకు గురైంది. అయ్యో పాపం అని జాలి చూపింది. అంతటితో ఆమె ఊరుకోలేదు. ఎలాగైనా ఆ చేప ఈదేలా చేయాలని నిర్ణయించింది. అంతే, ఆ బుల్లి చేప కోసం ఓ స్పెషల్ జాకెట్ చేయించింది. దాన్ని చేపకు తొడిగింది. ఆ తర్వాత చేప ఎంతో సులభంగా ఈదడం స్టార్ట్ చేసింది. మిగతా చేపల్లానే అది కూడా స్విమ్ చేస్తుంటే, ఆమె ఆనందంతో మురిసిపోయింది.

స్పెషల్ జాకెట్ లో ఉన్న చేప వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వండర్ ఫుల్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ మహిళ గొప్ప మనసుని ప్రశంసిస్తున్నారు. ఇంగ్లండ్ వుల్వర్‌హాంప్టన్ లోని గార్డెన్ అభయారణ్యంలో ఆ చేప ఉంది. మూత్రాశయంలో రుగ్మత కారణంగా ఆ చేప ఈదలేకపోయింది. ఏసీలో గాలిని ఫిల్టర్ చేసేందుకు వాడే చిన్న సైజు ప్లాస్టిక్ ట్యూబ్స్ తో ఆ మహిళ స్పెషల్ జాకెట్ చేయించింది. ఇప్పుడు ఆ గోల్డ్ ఫిష్ ఇతర చేపల్లా చక్కగా ఈదుతుంటే, చూసి మురిసిపోతోంది ఆ మహిళ.