Bald Head : బట్టతలతో బాధపడేవారికి గుడ్ న్యూస్

బట్టతలతో బాధపడుతున్న వారికి పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. బట్టతలపై జుట్టు మొలిపించే విధంగా నానో టెక్నాలజీని సిద్ధం చేశారు.

Bald Head : బట్టతలతో బాధపడేవారికి గుడ్ న్యూస్

Bald Head

Bald Head : యువతలో అత్యంత ఆందోళన కలిగించే సమస్య జుట్టురాలిపోవడం. అడ్డుఅదుపు లేకుండా జుట్టు రాలిపోతుండటంతో 30 ఏళ్లలోపే చాలామందిలో బట్టతల లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో 60 ఏళ్ళు దాటిన ముసలివారిలో బట్టతల కనిపించేది.. కానీ ఇప్పుడు వయసుతో పనిలేకుండా బట్టతల వస్తుంది. బట్టతల కారణంగా వయసు తక్కువగా ఉన్న పెద్ద వయసు వారిలా కనిపిస్తుంటారు.

ఇక ఈ సమస్య వలన మానసిక ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది. పెళ్లికాని యువకులు బట్టతల అనే పేరు వింటేనే భయపడుతున్నారు. ఇక ఈ సమస్యలకు పరిస్కారం కనుగొనేందుకు పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బట్టతలపై జుట్టు మొలిపించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలు రకాల ఇంజెక్షన్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

కుదుళ్ల ప్రాంతానికి నానో కణాలను పంపి, వెంట్రుకలు మొలిచేలా చేయవచ్చని పరిశోధకలు తేల్చారు. ఈ ఫార్ములా ప్రకారం ఎలుకలపై నిర్వహించిన ప్రాథమిక ప్రయోగం విజయవంతమైందని అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ పరిశోధకులు చెబుతున్నారు. జుట్టు రాలే ప్రక్రియను ‘ఆండ్రోజెనిక్‌ అలొపేసియా’ అంటారు. వాడుక భాషలో బట్టతలగా పిలుస్తాం. దీనికి ముఖ్యకారణం మాడు భాగానికి పోషకాలను సరఫరా చేసే ఫాలికల్స్‌ చుట్టూ రక్తనాళాలు లేకపోవడమే. దీనికితోడు వెంట్రుకలు పెరిగేందుకు, కొత్తవి పుట్టుకొచ్చేందుకు తోడ్పడే కణాలు చనిపోతూ ఉంటాయి.

ఈ అవరోధాలకు చెక్‌ పెట్టేందుకు పరిశోధకులు నానో కణాలను ప్రయోగిస్తున్నారు. బట్టతలపై జుట్టు మొలిపించేందుకు పరిశోధనలు చేసి మనుషులపై ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది సక్సెస్ అయి మార్కెట్లోకి వస్తే.. బట్టతలతో బాధపడుతున్న వారి సమస్య తీరుతుందని హెయిర్ స్పెషలిస్టులు చెబుతున్నారు.