గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ వేసుకున్నవారి నుంచి కరోనా వ్యాపించదు

గుడ్ న్యూస్.. వ్యాక్సిన్ వేసుకున్నవారి నుంచి కరోనా వ్యాపించదు

Good News It Looks Like Vaccinated People Cant Carry Or Spread The Virus

వ్యాక్సినేషన్‌పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్న మాట.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు… కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ.. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లను మరో 9 నెలల్లో వినియోగించుకోకపోతే అవి నిరూపయోగంగా మారిపోతాయని అంటున్నారు. అదే జరిగితే కరోనాపై పోరాటంలో ఓడిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు వ్యాక్సిన్లు ప్రభావం ఎంత? వేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఉంటుందా? అనే ప్రశ్నలు ఇప్పటికీ అనేకమందిలో వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఓ ఊరటనిచ్చే అధ్యయనం బయటకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా పూర్తిగా రాదని శాస్త్రవేత్తలు చెప్పట్లేదు.. కానీ దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. టీకా ప్రభావం 50శాతనికి పైనే ఉంటుందని అంటున్నారు.

అంతేకాదు.. టీకాలు వేసుకున్న వ్యక్తులు కరోనావైరస్ COVID-19 ప్రసారం చేసే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు వైరస్‌ను క్యారీ చెయ్యరని, వైరస్ క్యారియర్లుగా ఉండరని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు.. కరోనా వ్యాది ప్రసారం చేసే క్యారియర్లుగా మాత్రం ఉండరని సిడిసి డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ చెప్పారు.

ఈ అధ్యయనం ప్రకారం.. వ్యాక్సిన్‌లు ఫ్రంట్-లైన్ వర్కర్లకు, పెద్దవారికి ఇవ్వగా.. వైరస్ బారిన పడే ప్రమాదం వారికే ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే యునైటెడ్ స్టేట్స్ చుట్టూ ఎనిమిది ప్రదేశాలలో పరిశోధకులు దాదాపు 4,000 మంది ఆరోగ్య కార్యకర్తలు అవసరమైన కార్మికుల నుండి డేటాను సేకరించారు. ఫైజర్-బయోఎంటెక్ లేదా మోడరనా వ్యాక్సిన్ ఒక మోతాదు తరువాత సంక్రమణ ప్రమాదం 80% తగ్గింది. రెండవ మోతాదు తరువాత, క్లినికల్ ట్రయల్స్‌లో శాస్త్రవేత్తలు చూసిన మాదిరిగానే వారి ప్రమాదం 90% తగ్గింది, ఇది రెండు-మోతాదు వ్యాక్సిన్ సమర్థత రేటును 95% చూపించింది . సంక్రమణ లేకుండా, ఒక వ్యక్తి వైరస్‌ను వ్యాప్తి చేయలేడు.

అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాను సూచించిన మార్గదర్శకాలు మాత్రం పాటించవలసిందే అని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. మరోవైపు వైరస్ చాలా చిన్నది. వెంట్రుకలో వెయ్యో వంతు ఉంటుంది. అంత చిన్న వైరస్ తన రూపాన్ని మార్చుకోవడం క్షణాల్లో పని. ఈ ప్రపంచంలో కరోనాకి వ్యాక్సిన్ వచ్చేంతవరకూ కరోనా వైరస్ తన రూపాన్ని పెద్దగా మార్చుకోలేదు.

ఎప్పుడైతే వ్యాక్సిన్ వచ్చిందో… తనను చంపేస్తున్నారని గ్రహించిన వైరస్… రూపాన్ని మార్చేసుకుంటోంది. కొత్త స్ట్రెయిన్‌లు ఇప్పుడున్న టీకాలకు సవాల్‌ విసురుతున్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న వ్యాక్సిన్‌లను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ జరగాలని సూచిస్తున్నారు.