దుబాయ్ నుంచి వదిలిపోతున్న ఫొటోగ్రాఫర్.. చివరిక్షణాలు గుర్తుండిపోవాలని ఇలా

దుబాయ్ నుంచి వదిలిపోతున్న ఫొటోగ్రాఫర్.. చివరిక్షణాలు గుర్తుండిపోవాలని ఇలా

లూయిసా సుమాగీ దుబాయ్ నుంచి రిటర్న్ అయ్యే ముందు చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలనుకున్నారు. దుబాయ్‌లో ఉద్యోగాలు కోల్పోయి 12ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఆ క్షణాలను సుమాగీ చిత్రీకరించారు. ఆమె భర్తతో పాటు బీచ్ లో సూర్యుని వెలుతురు పడుతుండగా ఇద్దరు పిల్లలతో కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోగ్రాఫ్ కర్టసీని పాలా హైనీకి ఇచ్చేశారు. అంతేకాకుండా పదివేలకు పైగా దుబాయ్ వదిలివెళ్లిపోతున్న వారికి ఫ్రీ ఫొటో సెషన్స్ నిర్వహిస్తున్నారు.

ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్న సీనియర్ స్టాఫ్ ల ఫొటోలను తీస్తూ ఉన్నా. వాళ్లు 15-20 సంవత్సరాల వరకూ దుబాయ్ లో ఉంటారు. ఇదే వారి జీవితం, వారికి ఇక్కడ ఇళ్లు ఉన్నా వారి సొంతిళ్లకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి’ అని మీడియాతో చెప్పుకొచ్చాడు.

పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిపోవడం, సోషల్ డిస్టన్సింగ్ ఫాలో అవుతుండటంతో ఫొటోగ్రాఫర్ బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది. ఇప్పటివరకూ 60 ఫ్రీ షూట్స్ తీయగా మరో 100 ఫొటో షాట్స్ తీయాలనుకుంటున్నాడు. యూఏఈలోని ఎక్కువ జనాభా దుబాయ్ కు చెందినవారే. విదేశీయులకు గల్ఫ్ అరబ్ ఎటువంటి పౌరసత్వాన్ని ఇవ్వడం లేదు.

రీజనల్ టూరిజం అండ్ బిజినెస్ హబ్, దుబాయ్ కరోనా మహమ్మారి కారణంగా భారీగా నష్టపోయింది. రీసెంట్ గా కర్ఫ్యూ ఎత్తేసి నియమ నిబంధనలు సడలించారు. విదేశీ పర్యాటకులకు జులై 7నుంచి అనుమతిస్తున్నట్లు తెలిపారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఆప్షన్ లేక భవిష్యత్ గురించి వలసలు మొదలుపెట్టేశారు.

దురదృష్టవశాత్తు నాకు ఇక్కడ ఉండడానికి అవకాశాలు లేవు. ఏదో ఒక రోజు మేం తిరిగి వస్తామని అనుకుంటున్నాం. అని ఓ ఫొటోగ్రాఫర్ అంటున్నారు.

Read Here>>టిక్‌టాక్‌ నిషేధం దిశగా.. భారత్ దారిలోనే అమెరికా?