మీ ఇంట్లో ఫ్రీగా 3Dజంతువులను చూడాలనుకుంటున్నారా..

గూగుల్ (AR)టెక్నాలజీతో మీకు చూడాలనుకున్న జంతువును ఇంట్లోనే చూడొచ్చు. లాక్ డౌన్ పీరియడ్ లో వినియోగదారులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయ్యేందుకు గూగుల్ కొత్త ఆన్ లైన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.

మీ ఇంట్లో ఫ్రీగా 3Dజంతువులను చూడాలనుకుంటున్నారా..

గూగుల్ (AR)టెక్నాలజీతో మీకు చూడాలనుకున్న జంతువును ఇంట్లోనే చూడొచ్చు. లాక్ డౌన్ పీరియడ్ లో వినియోగదారులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయ్యేందుకు గూగుల్ కొత్త ఆన్ లైన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో పులి, బాతు, కుక్క లాంటి వాటిని మన ఇంట్లోనే చూడగలం. దీని కోసం మనం చేయాల్సిందేం లేదు. కేవలం గూగుల్ సెర్చ్ చేయడమే.

అన్ని జంతువులు కాకపోయినా కొద్దిపాటి జంతువులను గూగుల్ ఏఆర్ లో చూడొచ్చు. పులి, అల్లిగేటర్, యాంగ్లర్ ఫిష్, బ్రౌన్ ఎలుగుబంట, పిల్లి, చిరుత పులి, కుక్క, బాతు, పెంగ్విన్, జయంట్ పాండా, మేక, హెడ్గేహగ్, గుర్రం, సింహం, మకా, అక్టోపస్, తిమింగళం, షార్క్, షెట్లాండ్ పోనీ, పాము, పులి, తాబేలు, తోడేలు లాంటి జంతువులను త్రీడీలో చూడొచ్చు. అంతేకాదు బుధుడు, భూమి, ప్లూటో లాంటి గ్రహాలనుకూడా దగ్గరుండి చూడొచ్చు.

ఈ ఏఆర్ టెక్నిక్ తో 3D జంతువులను ఎలా చూడాలి:
దీని కోసం చాలా సులువైన టెక్నిక్ వాడొచ్చు. కేవలం గూగుల్ లో సెర్చ్ చేయడమే. మనకు కావలసిన జంతువు పేరు టైప్ చేయగానే ఆ జంతువు మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు Tigerఅని టైప్ చేస్తే పులి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ మనకు ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది View in 3D అనేది సెలక్ట్ చేసుకోగానే ఓ బాక్స్ వస్తుంది. దాని స్టేటస్ Meet a life-sized tiger up close అని వస్తుంది.

అక్కడ కనిపించే ఆప్షన్లలో మనకు ప్లేస్ అడ్జస్ట్ చేసుకోమని అడుగుతుంది. దానికి అనుగుణంగా మనం సెల్ ఫోన్ స్క్రీన్ తిప్పితే అక్కడ ఆ జంతువు ప్రత్యక్షం అవుతుంది. అంతేకాకుండా ఆ జంతువు సైంటిఫిక్ పేరు, జీవితకాలం, వేగం, ఎత్తు, డైట్ వంటి అంశాలను వివరిస్తుంది. ఆ జంతువు సైజ్ ను మనం పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. అది 30 సెకన్లలో మాయం అవుతుంది.