Trump నిర్ణయంపై Google CEO రెస్పాన్స్

  • Published By: madhu ,Published On : June 23, 2020 / 05:53 AM IST
Trump నిర్ణయంపై Google CEO రెస్పాన్స్

H1B వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీసాల జారీని రద్దు చేస్తూ..లెటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వివిధ రంగాల వారు అభిప్రాయాలు తెలియచేస్తున్నారు. Google CEO సీఈవో సుందర్ పిచాయ్.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2020, జూన్ 23వ తేదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 

ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. విదేశీ టెకీలకు వీసాలు జారీ చేయబోమని ట్రంప్ చేసిన ప్రకటన నిరుత్సాహ పరిచినా..తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్ కు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని పిచాయ్ తెలిపారు.

ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రంగంలో ముందుండడానికి ఇమ్మిగ్రేషన్ విధానం ఎంతో తోడ్పడిందనే అభిప్రాయం తెలిపారు. ఈ కారణంగానే..అమెరికా టెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్ గా మారిందని, గూగుల్ కంపెనీ ప్రస్తుతం ఇలా ఉందంటే..ఇమ్మిగ్రాంట్ల వల్లే అని పిచాయ్ అని వెల్లడించారు. 

హెచ్‌ 1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని Trump నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌31 వరకూ హెచ్‌ 1బీ, హెచ్‌ 2బీ, జే 1, ఎల్‌ 1 వీసాల జారీని నిలిపివేశారు. హెచ్‌ 1బీ వీసాల జారీ విధానంలో సంస్కరణలకు ట్రంప్‌ పిలుపు ఇచ్చారు.

మెరిట్‌ ఆధారంగానే హెచ్‌1బీ వీసాల జారీకి మొగ్గుచూపారు. దీంతో ప్రతిభావంతులకే అమెరికాలో ఎంట్రీ లభించనుంది. హెచ్‌ 1బీ రెన్యువల్స్‌కు ఢోకా లేదని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. 

 

Read:  కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేశాం, నైజీరియా సైంటిస్టుల ప్రకటన