Google Employees: ఆఫీసుకు వచ్చే ఉద్యోగులకు వ్యాక్సిన్ నిబంధనను ఎత్తేసిన గూగుల్

టెక్నాలజీ దిగ్గజం గూగుల్..అనూహ్య నిర్ణయం తీసుకుంది. కార్యాలయానికి వచ్చి పనిచేసే తమ ఉద్యోగులకు "వ్యాక్సిన్ తప్పనిసరి" నిబంధనను ఎత్తివేస్తు నిర్ణయం తీసుకుంది.

Google Employees: ఆఫీసుకు వచ్చే ఉద్యోగులకు వ్యాక్సిన్ నిబంధనను ఎత్తేసిన గూగుల్

Gogole

Google Employees: టెక్నాలజీ దిగ్గజం గూగుల్..అనూహ్య నిర్ణయం తీసుకుంది. కార్యాలయానికి వచ్చి పనిచేసే తమ ఉద్యోగులకు “వ్యాక్సిన్ తప్పనిసరి” నిబంధనను ఎత్తివేస్తు నిర్ణయం తీసుకుంది. కాగా డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో గత జూలైలో ఉద్యోగులు, ఇంటి నుంచి పనిచేస్తున్నా, లేక కార్యాలయానికి వచ్చి పనిచేసినా వ్యాక్సిన్ తప్పనిసరి అంటూ గూగుల్ ఆదేశాలు జారీ చేయగా.. వ్యాక్సిన్ తీసుకోనివారు ఉద్యోగాలు కొల్పాతారంటూ హెచ్చరించింది కూడా. ఈక్రమంలో నేడు వ్యాక్సిన్ నిబంధనలు ఎత్తివేసినట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021 జులై చేసిన “వ్యాక్సిన్ మ్యాండేట్” ప్రకటనను జనవరి 2022లో ఉపసహంరించుకుంది. అదేసమయంలో వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు కరోనా నిబంధనలు (మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం)ను కూడా ఎత్తివేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. నిబంధనలు ఎత్తివేయడంతో.. గతంలో మాదిరిగా ఉద్యోగులకు కార్యాలయాల్లో అందించే మస్సాజ్, ఇతర ఆటవిడుపు ప్రోత్సాహకాలను కూడా తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించడం కొసమెరుపు.

Also  read: RBI Alert : మీ ఫోన్లో ఈ లోన్ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. ఆర్‌బీఐ హెచ్చరిక!

గూగుల్ విధించిన వ్యాక్సిన్ మ్యాండేట్ ను వ్యతిరేకిస్తూ సంస్థకు చెందిన 600 మంది ఉద్యోగులు నవంబర్ 2021లో ఒక లేఖ రాశారు. అదే సమయంలో యూఎస్ లో కరోనా ఆంక్షలు కాస్త సడలించడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందని గూగుల్ ప్రధాన కార్యదర్శి లోరా లీ ఎరిక్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అమెరికా ఉద్యోగులకు మాత్రమే సడలించిన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్న ఆమె..ఇతర దేశాల్లో నిబంధనల మేరకు అక్కడి ఉద్యోగులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తామని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సౌకర్యాలు కలిగిన గూగుల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు అనేకమంది ఉద్యోగార్థులు ఉత్సాహం కనబరుస్తుంటారు. ఉచిత భోజనం, జిమ్, వ్యక్తిగత సౌకర్యాలు వంటి ఎన్నో వసతులను గూగుల్ అందించడమే అందుకు కారణం.

Also read: Mukesh Ambani : వచ్చే 20 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా భారత్ : ముఖేశ్ అంబానీ

కరోనా కారణంగా ఆఫీసులో పనిచేసే ఎంజాయిమెంట్ ను కోల్పోయామంటూ గూగుల్ ఉద్యోగులు ఒక సర్వేలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో తిరిగి కార్యాలయాలకు వచ్చి.. పనిచేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని సంస్థ ప్రతినిదులు తెలిపారు. ఇక గూగుల్ కార్యాలయాల్లో తిరిగి సాధారణ(కరోనాకు మునుపటి) పరిస్థితులు నెలకొంటాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే ఇంకా వ్యాక్సిన్ తీసుకునేవారికి మాత్రం ప్రభుత్వ పరమైన ఆంక్షలు కొనసాగుతాయని కూడా గూగుల్ తెలిపింది.