కొవిడ్-19 తప్పుడు సమాచారానికి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ట్రిక్

కొవిడ్-19 తప్పుడు సమాచారానికి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ట్రిక్

google-omicron

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి గూగుల్ ప్లాట్ ఫాంపై చాలామంది సెర్చింగ్ చేశారట. మరి యూజర్లకు తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవకుండా ఉండేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 12న గూగుల్ ఈ కొత్త ఫీచర్ అంశాన్ని అనౌన్స్ చేసింది.

ఏ వ్యాక్సిన్లు అయితే ఆ లొకేషన్లలో ఆథరైజ్డ్ గా ఉన్నాయో.. కొవిడ్-19 వ్యాక్సిన్ గురించి సెర్చ్ చేసే యూజర్లకు వాటి ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్‌ను తెలియజేయనుంది. సరైన గుర్తింపు లేకుండా అమ్మేయాలనుకునే వ్యాక్సిన్లకు ఇది చెక్ పెట్టడం లాంటిది. దాంతో పాటు ఏ వ్యాక్సిన్ ఎక్కడ యూజర్లకు అందుబాటులో ఉంటుందో చెప్పేస్తుంది.

యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ఈ ఫీచర్ ను లాంచ్ చేసేశారు. ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్ సహాయంతో లొకేషన్ ఆధారంగా వ్యాక్సిన్ ఎంచుకోవచ్చు. యూకేలోనే కాకుండా ఈ కొత్త ఫీచర్ ను అన్ని దేశాల్లో ఆథరైజ్ చేస్తామని హెల్త్ అథారిటీలు చెబుతున్నాయి.

మార్చి 2020 నుంచే గూగుల్ కొవిడ్-19 ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్‌ గురించి చెబుతూ ఉండగా యూట్యూబ్ లో ఈ విషయాన్ని 400బిలియన్ సార్లు చూశారు. ఈ ప్యానెల్స్ యూట్యూబ్ హోంపేజి, వీడియోలు, సెర్చ్ రిజల్ట్స్ లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్యానెల్స్ అప్ డేట్ చేస్తుండటంతో గ్లోబల్, లోకల్ హెల్త్ అథారిటీలకు వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేస్తుంది.

మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి గూగుల్ కంపెనీ.. 250 మిలియన్ డాలర్ల యాడ్ అనుమతులు ఇస్తూనే ఉందట. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100గవర్నమెంట్ ఏజెన్సీలు కొవిడ్ 19 గురించి క్రిటికల్ పబ్లిక్ సర్వీస్ చేయగలిగాయి. ఈ గ్రాంట్లు అనుమతించిన పబ్లికేషన్లు 2021వరకూ వాడుకోవచ్చట. వ్యాక్సిన్ ఎడ్యుకేషన్, ప్రచారం గురించి శనివారం మరో 15మిలియన్ డాలర్లు అనౌన్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు ఇది హెల్ప్ అవుతుంది.