Google Employees: ప్రతి వారం గూగుల్ ఉద్యోగులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!!

గూగుల్ ఇకపై ప్రతి వారం తమ ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్‌లో గూగుల్ ఆఫీసుల్లోకి..

Google Employees: ప్రతి వారం గూగుల్ ఉద్యోగులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!!

Google

Google Employees: గూగుల్ ఇకపై ప్రతి వారం తమ ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్‌లో గూగుల్ ఆఫీసుల్లోకి, ఫెసిలిటీస్ లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరూ వారంలోగా చేయించుకున్న వైద్యపరీక్షల రిపోర్ట్‌తో రావాలని శుక్రవారం వెల్లడించింది. గూగుల్ యూఎస్ వర్క్ సైట్స్ లో పనిచేసేందుకు వచ్చే వారికి టెస్టుల్లో కచ్చితంగా నెగెటివ్ వచ్చి ఉండాలని చెప్పారు. సర్జికల్ మాస్కులు కచ్చితంగా ధరించాలని చెప్పారు.

కొవిడ్-19 వ్యాప్తి అడ్డుకోవడానికి, రిస్క్ పెరగకుండా ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాం. హెల్త్ అండ్ సేఫ్టీ సూచనలు పాటిస్తూ ఉండాల్సిందే అని గూగుల్ అధికార ప్రతినిధి అన్నారు.

ఈ క్రమంలోనే గూగుల్ తమ ఉద్యోగులకు వారి కుటుంబ సబ్యులకు ఉచితంగా ఇంటి వద్దనే పరీక్షలు చేయించుకునే ఏర్పాట్లు చేసింది. దేశంలో ఒమికా్రిన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగానే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఒమిక్రాన్ కారణంగా ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు చెప్పింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో రూ.500కే 24K గోల్డ్ ఐస్‌క్రీమ్

కొవిడ్ మహమ్మారి కారణంగా తొలి సారి వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చింది గూగుల్ సంస్థనే.