Google Search : గూగుల్‌లో సూపర్ ఫీచర్, ఇంగ్లీష్ పదాలకు ఈజీగా అర్థం తెలుసుకోవచ్చు
ఇంగ్లీష్ భాషా ప్రాధాన్యత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఏ మూలనైనా బ్రతికేయొచ్చు.

Google Search
Google Search : ఇంగ్లీష్ భాషా ప్రాధాన్యత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ భాష వస్తే ప్రపంచంలో ఏ మూలనైనా బ్రతికేయొచ్చు. అయితే చాలామందికి పనిలో నైపుణ్యం ఉన్నప్పట్టికీ ఇంగ్లీష్ రాక ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకురాలేకపోతున్నారు. ఇంగ్లీష్ వచ్చినా కొన్ని కఠినమైన పాదాలకు అర్ధాలు తెలియక సతమతమవుతుంటారు. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని గూగుల్ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇది వినియోగదారులు ప్రతిరోజూ కొత్త ఆంగ్ల పదాన్ని నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ గూగుల్ సెర్చ్ లో బాగా ట్రెండ్ అయ్యే పాదాల అర్ధాల్న నోటిఫికేషన్లా పంపుతుంది.
ప్రతి రోజు ఓ కొత్తపదంతోపాటు దానికి డెఫినేషన్ కూడా క్లియర్‌గా ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిపై గూగుల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గూగుల్ ట్రెండ్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలను పరిగణలోకి తీసుకోని దీనిని రూపొందించినట్లు తెలిపారు. ఇది విభిన్న పదాల గురించి తెలుసుకోవడానికి మీకు సహాయపడటమే కాకుండా ఉత్సాహాన్ని పెంచుతుందని గూగుల్ తెలిపింది.

Google English
గూగుల్ ఫీచర్ ఎలా యాక్టివ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత సెర్చ్బార్లో ఉదాహరణకు డెమోక్రసీ అనే పదం అర్ధం తెలుసుకోవాలని ఉంటే..ముందుగా define అని టైప్ చేయాలి. ఆ వర్డ్ పక్కనే డెమోక్రసీ (define democracy) అని టైప్ చేస్తే ఆ పదం అర్ధం వస్తుంది.