Google Health App : గూగుల్ నుంచి గుడ్ న్యూస్… మెడికల్ రికార్డులు దాచుకోవచ్చు

గూగుల్ త్వరలో హెల్త్ యాప్ లాంచ్ చేయనుంది. ఇది యూజర్లకు ఎంతో హెల్పింగ్ గా ఉండనుంది. యూజర్లు తమ మెడికల్ రికార్డులను ఆ యాప్ లో స్టోర్ చేసుకోవచ్చు.

Google Health App : గూగుల్ నుంచి గుడ్ న్యూస్… మెడికల్ రికార్డులు దాచుకోవచ్చు

Google Health App

Google Health App : గూగుల్ త్వరలో హెల్త్ యాప్ లాంచ్ చేయనుంది. ఇది యూజర్లకు ఎంతో హెల్పింగ్ గా ఉండనుంది. యూజర్లు తమ మెడికల్ రికార్డులను ఆ యాప్ లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాపిల్ హెల్త్ ఫిట్ యాప్ అందుబాటులో ఉంది. దానిలాగే గూగుల్ హెల్త్ యాప్ పని చేయనుంది. యూజర్లు తమ మెడికల్ రికార్డులు డాక్టర్లు, తమ కేర్ టేకర్లతో షేర్ చేసుకోవచ్చు.

”గూగుల్ హెల్త్ యాప్ కి సంబంధించి స్క్రీన్ షాట్ లీక్ అయ్యింది. యాప్ తయారీకి సంబంధించిన వర్క్ జరుగుతోంది. మీ ఆరోగ్యం వీక్షణ చూడండి, మీ డాక్టర్ సందర్శన, ల్యాబ్ లు మరిన్ని. మీరు మీ ఆరోగ్య సంరక్షణ పొందిన ప్రదేశాల నుండి మీ ఆన్‌లైన్ ఖాతాలను లింక్ చేయడం ద్వారా ప్రారంభించండి” అనే సమాచారం తెలిసింది. ఈ యాప్ వివిధ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, డాక్టర్లు, ల్యాబ్స్ నుంచి యూజర్ రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది.

అంతేకాదు.. గూగుల్ హెల్త్ యాప్.. యూజర్లు తమ సమాచారాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులతో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ యాప్ ని స్టార్ట్ చేయాలంటే.. యూజర్లు వివిధ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుంచి తమ మెడికల్ రికార్డులను లింక్ చేయాల్సి ఉంటుంది. అలా హెల్త్ డేటాను స్టోర్ చేసుకుని ఆ తర్వాత ఫోన్ లో చూపిస్తుంది. రెగులర్ గా ఆసుపత్రులకు వెళ్లే వారికి ఈ హెల్త్ డేటా బాగా ఉపయోగపడుతుంది.

టిప్ స్టర్ ఇషాన్ అగర్వాల్ లీక్డ్ స్క్రీన్ షాట్ షేర్ చేసింది. ప్రస్తుతం యాప్ డెవలప్ మెంట్ ఇంకా ప్రారంభ దశల్లో ఉంది. గూగుల్ అభివృద్ధి చేస్తున్న ఈ హెల్త్ యాప్.. తొలుత యాండ్రాయిడ్ డివైజస్ లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.