Dinosaur skeleton : 7.7 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ అస్థి పంజరం ధర రూ.48.5 కోట్లు

డైనోసార్లలో భయంకరమైన టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) కంటే ముందునాటి గోర్గోసారస్ డైనోసార్ అస్థి పంజరం. కోట్ల ఏళ్ల కిందటి అస్థిపంజరం ఏకంగా రూ. 48.5 కోట్ల ధర పలికింది.

Dinosaur skeleton : 7.7 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ అస్థి పంజరం ధర రూ.48.5 కోట్లు

77 Million Year Old Dinosaur Skeleton Sells For Rs.రూ.48.5 Cr

77-million year old dinosaur skeleton sells for Rs.రూ.48.5 cr : కొన్ని వేల ఏళ్ల క్రితం ఈభూమ్మీద నివసించి అంతరించిపోయిన భారీ ఆకారంలో ఉండే డైనోసార్ ల అవశేషాలు ఈనాటికి బటయపడుతునే ఉన్నాయి. డైనోసార్ అస్థిపంజరాలు. గుడ్లు, దంతాలు..ఇలా ఎక్కడోక చోట పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈక్రమంలో తొలినాటి డైనోసార్లలో ఒకటైన గొర్గోసారస్ అస్థి పంజరం అత్యంత భారీ ధర పలికింది.సోత్ బీ వేలంపాటలో 10అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవున్న డైనోసార్ అస్థిపంజరం ఏకంగా రూ.48.5 కోట్లు పలికింది.

ఎందుకంటే అది సాదా సీదా అస్థిపంజరం కాదు. కోట్ల ఏళ్ల కిందటిది. అందుకే ఏకంగా రూ. 48.5 కోట్ల ధర పలికింది. డైనోసార్లలో భయంకరమైన టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) కంటే ముందునాటి గోర్గోసారస్ డైనోసార్ అస్థి పంజరం. అంతేకాదు.. ఇది టి రెక్స్ కంటే కూడా వేగంగా కదులుతూ దాడి చేయగలదని..దీని బలం కూడా చాలా వేగంగా ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు. 7.7 కోట్ల ఏళ్ల కిందట తిరుగాడిన డైనోసార్.. టీ–రెక్స్ కన్నా ప్రమాదకరం అని చెబుతున్నారు పరిశోధకులు.

టీ రెక్స్ కన్నా వెరీ డేంజరస్..
తొలితరం డైనోసార్లు తిరుగాడిన క్రేటాషియస్ కాలానికి చెందిన భయానక మాంసాహార డైనోసార్లలో గొర్గోసారస్ ఒకటని.. అమెరికా, కెనడా ప్రాంతాల్లో జీవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గొర్గోసారస్ అస్థి పంజరాన్ని 2018లో అమెరికాలోని మోంటానాలో జుడిత్ నది సమీపంలో గుర్తించారు. పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్న ఈ అస్థి పంజరం 7.7 కోట్ల ఏళ్ల కింద తిరుగాడిన డైనోసార్ దిగా నిర్ధారించారు. గురువారం న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత సోత్ బీ వేలం శాల జులై 21 నుంచి న్యూయార్క్ లో దీనిని ప్రదర్శనకు ఉంచింది. తాజాగా వేలం వేయగా.. 6.1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.48.5 కోట్లు ధర పలికింది.

గొర్గోసారస్ డైనోసార్లు రెండు టన్నుల వరకు బరువు ఉండేవని..టీ రెక్స్ కన్నా వేగంగా, బలంగా దాడి చేసేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గార్గోసారస్ లు ఏకంగా 42 వేల న్యూటన్ల బలంతో కొరికేసేవి అని అంచనా వేశారు. మనకు తెలిసిన అత్యంత బలమైన సింహాలు, పులులు కొరికే బలం నాలుగైదు వేల న్యూటన్లు మాత్రమే. అంటే..సింహం కంటే10 రెట్లు బలంతో దాడి చేసేదన్న మాట.

ఇంతకుముందు 1997లో టీ–రెక్స్ డైనోసార్ అస్థి పంజరాన్ని వేలం వేయగా 8.36 మిలియన్ డాలర్లకు (రూ.66.36 కోట్లు) అమ్ముడు పోయింది. 2020లో మరో టీ–రెక్స్ అస్థి పంజరానికి ఏకంగా 31.8 మిలియన్ డాలర్లు (రూ.252.5 కోట్లు) పలకడం గమనించాల్సిన విషయం.