గుర్రుపెడుతున్న బామ్మ : పక్కకొచ్చిన పైథాన్ హల్ చల్

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 12:23 PM IST
గుర్రుపెడుతున్న బామ్మ : పక్కకొచ్చిన పైథాన్ హల్ చల్

బ్యాంకాక్‌ : గుర్రు పెట్టి హాయిగా నిద్రపోతున్నప్పుడు ఓ భారీ పాము వచ్చి పక్కలో పడుకుంటే ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకుంటే వణుకొచ్చేస్తుంది కదూ. అదిగో అటువంటి ఘటనే థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ లో చోటుచేసుకుంది. 
Also Read : అప్పుల తిప్పలు : యూట్యూబ్‌లో చూసి దొంగనోట్ల తయారీ

బ్యాంకాక్‌కు చెందిన కౌ సుదోసోపా (75) అనే బామ్మగారు నిద్రపోతున్న సమయంలో కొండచిలువ ఆమె గదిలోకి దూరింది. నెమ్మదిగా పాక్కుంటు వచ్చిన ఆ కొండచిలువ ఆమె కాలును పట్టుకుంది. ఏం జరిగిందో తెలీదు..కానీ ఆమెను నిద్ర మెలకువ చ్చింది. ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి టార్చ్ లైట్ వేసి చూసేసరికి పెద్ద కొండచిలువ కనిపించింది. 

ఇంకేముంది ఆ బామ్మగారు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే పక్కనే ఉన్న  ఆమె తన కుమారుడు నక్రోన్ గదిలోకి పరిగెట్టింది. ఇదంతా ఆమె గదిలో ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. నక్రోన్ వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. వెంటనే వచ్చిన సదరు సిబ్బంవది ఆ కొండచిలువను పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టారు. ఈ వీడియోను నక్రోన్ నెట్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Also Read : కాంగ్రెస్‌తో బీజేపీ సీక్రెట్‌ పొత్తు