బ్రిటన్ ప్ర్రిన్స్ హ్యారీకి కొత్త ఉద్యోగం దొరికిందా?..!!

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 09:30 AM IST
బ్రిటన్ ప్ర్రిన్స్ హ్యారీకి కొత్త ఉద్యోగం దొరికిందా?..!!

గ్రేట్ బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ రాజ కుటుంబం నుంచి తప్పుకున్న వెంటనే కొత్త ఉద్యోగం దొరికిందని ట్విట్టర్ వినియోగదారులు చమత్కరించారు. ప్రిన్స్ హ్యారీ గోడపై బోల్ట్ కొడుతున్న ఓ ఫోటో వైరల్ గా మారింది. రేటెడ్ పీపుల్ ప్రకటన – వర్తకుల కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం – వారి మోడల్ సైమన్ పెంగెల్లీ డ్యూక్ ఆఫ్ సస్సెక్స్‌తో పోలికను ప్రజలు గమనించడంతో వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే..రేటెడ్ పీపుల్ అనే కంపెనీ తన మోడల్ మిస్టర్ పెంగెల్లి గోడపై బోల్డ్ కొట్టినట్లుగా ప్రకటన చేయించింది.

ఈ ప్రకటనకు సంబంధించిన ఫోటోలు యాడ్ లు లండన్ అంతటా ట్యూబ్‌లో కనిపించింది. మోడల్ పెంగెల్లి ప్రిన్స్ హ్యారీ పోలికలు ఉండటంతో  నెటిజన్లు ప్రిన్స్ హ్యారీ రాజకుటుంబంలోంచి వచ్చిన తరువాత ఈ ఉద్యోగంలో చేరాడా? అంటూ చమత్కరిస్తున్నారు. వైరల్ గా మారిన ఈ ఫోటోను UK మాజీ రాజకీయ నాయకుడు మార్క్ ప్రిస్క్ తన ట్వీట్ పోస్ట్ చేశారు. “డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ చూడటం చాలా బాగుంది.”అంటూ తెలిపారు. 

కాగా..బ్రిటన్ రాజకుటుంబం నుంచి వేరు పడాలన్న ప్రిన్స్ హ్యారీ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. హ్యారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఫాస్ట్ ఫుడ్ సంస్థ బర్గర్ కింగ్.. పార్ట్ టైం ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ట్విటర్ ద్వారా బ్రిటన్ యువరాజుకు బర్గర్ కింగ్ యాజమాన్యం ఉద్యోగ అవకాశాన్ని వెల్లడించింది. హ్యారీ తన కిరీటాన్ని పక్కకు పెట్టకుండానే తమతో కలిసి పనిచేయమని కోరింది. దీంతో బర్గర్ కింగ్ ట్వీట్ క్షణాల్లోనే వైరల్గా మారింది. బర్గర్ కింగ్ చాలా అద్భుతమైన జోక్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.