కిక్కు లెక్క 196 : టైర్లు లేకుండా కారు నడిపేసిన మందుబాబు

  • Edited By: veegamteam , January 6, 2020 / 10:46 AM IST
కిక్కు లెక్క 196 : టైర్లు లేకుండా కారు నడిపేసిన మందుబాబు

ఓ మందుబాబుకి తలకు కిక్కు బాగా ఎక్కింది.ఎంతగా ఎక్కిందంటే..టైర్లు లేకుండానే కారు నడిపేసినంత.ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మంచేస్టర్‌కు చెందిన ఈ మందుబాబు తాను నడిపే కారుకు టైర్లు ఉన్నాయో లేదో కూడా తెలియనంత బాగా నిషా ఎక్కేసిన సదరు మందుబాబు కారు రోడ్డుపై వెళుతుంటే బరబరామంటూ సౌండ్. అడ్డదిడ్డంగా ఎలాపడితే అలా నడుపుకుంటు వస్తున్న కారును చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ కారు నడిచే తీరు చూసి పోలీసులకు అనుమానం వచ్చింది.ఆపటానికి దగ్గరకెళ్లి చూడగా కారుకు టైర్లు లేవు.  

అది చూసిన పోలీసులు..వీడి దుంప తెగా..కారుకు టైర్లు ఉన్నాయో లేదో కూడా తెలియనంత సోయ లేకుండా ఉన్నాడు అంటే వీడు కచ్చితంగా మందుబాబే అని నిర్థారణకు వచ్చేరు. రోడ్డుపై బరాబరా మంటూ చక్కర్లు కొట్టేస్తున్న ఆకారుని పోలీసులు ఆపారు. న్యూ ఇయర్ రోజున మందుబాబులను పట్టుకొనేందుకు పోలీసులు ఎక్కడికక్కడ కాపుకాశారు.  

అసలే న్యూఇయర్ కావటంతో ఫుల్ గా మందుకొట్టాడు. కారు ఎక్కేశాడు. స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ అయ్యింది. కాస్త మొరాయించింది.ఎందుకంటే కారుకు టైర్లు లేవు. అది తెలుసుకునే స్టేజ్ లో లేడు మందుబాబు. అలా అడ్డదిడ్డంగా వస్తున్న సదరు మత్తుబాబుని తెల్లవారుజామున నార్త్ వెస్ట్ మోటర్‌వే 1:50 గంటలకు పోలీసులు ఆపారు. బ్రీతింగ్ టెస్ట్ చేశారు. పోలీసులు షాక్ అయ్యారు. ఆల్కహాల్ శాతం వందకు 196 మైక్రోగ్రామ్ ఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం ఫస్ట్ టైమ్ కాదని ఇప్పటికి ఆరుసార్లు పట్టుబడ్డాడని పోలీసులు గుర్తించారు.