అమెరికాలో మోడెర్నా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్

అమెరికాలో మోడెర్నా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్

Green signal for modern vaccine in America : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఫైజర్‌ను సాధారణ ప్రజల వినియోగానికి తీసుకొచ్చిన అమెరికా.. ఇప్పుడు మరో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రానుంది. అమెరికాలో మోడెర్నా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. మోడెర్నా వ్యాక్సిన్ కు ఎఫ్ డీఏ ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన అనుమతులను జారీ చేసింది. ఫైజర్ తర్వాత అమెరికాలో ఆమోదం పొందిన రెండో వ్యాక్సిన్ మోడెర్నా.

డిసెంబర్ 11న ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఎఫ్‌డీఏ ఆమోదం తెలుపగా..సరిగ్గా వారం రోజుల్లో రెండో టీకాను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. నాలుగైదు రోజుల్లో దీని వినియోగం అమెరికా వ్యాప్తంగా ప్రారంభించబోతోంది. మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను సాధారణ వినియోగానికి తీసుకొచ్చిన తొలి దేశం..అమెరికా. ఇప్పటిదాకా ఏ దేశం కూడా మోడెర్నా వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వలేదు. ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను ఆయా చోట్ల పరిశీలన దశలో ఉన్నాయి.

ఫైజర్ తరువాత సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ ఇదే. మోడెర్నా కోసం ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా కోసం రూపొందించిన రవాణా వ్యూహాలనే అనుసరించనుంది. తొలి ప్రాధాన్యతగా 70 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల కరోనా పేషెంట్లకు వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేస్తారు.