France vs Germany: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా..ప్యారాచూట్ తో స్టేడియంలో దిగిన వ్యక్తి

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్నంత సేపూ ఉత్కంఠగా కన్నార్పకుండా చూస్తుంటారు. అలా ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతుంటే ఓ వ్యక్తి స్టేడియం మధ్యలో ప్యారాచూట్ తో దిగితే ఎలా ఉంటుంది? యూరోక‌ప్‌లో భాగంగా నిన్న‌ జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ మ‌ధ్య జ‌రిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఇటువంటి ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఓ నిరసనకారుడు ప్యారాచూట్ తో స్టేడియంలో దిగాడు.

France vs Germany: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా..ప్యారాచూట్ తో స్టేడియంలో దిగిన వ్యక్తి

France Vs Germany

France vs German : ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్నంత సేపూ ఉత్కంఠగా కన్నార్పకుండా చూస్తుంటారు. అలా ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతుంటే ఓ వ్యక్తి స్టేడియం మధ్యలో ప్యారాచూట్ తో దిగితే ఎలా ఉంటుంది? యూరోక‌ప్‌లో భాగంగా నిన్న‌ జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ మ‌ధ్య జ‌రిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఇటువంటి ఘ‌ట‌న చోటు చేసుకుంది.

యూరోక‌ప్ స్పాన్స‌ర్‌గా ఉన్న ర‌ష్యాకు చెందిన ఇంధ‌న ఉత్ప‌త్తి సంస్థ గాజ్‌ప్రోమ్‌కు వ్య‌తిరేకంగా ఓ వ్య‌క్తి కొత్తరంగా నిరసన తెలపాలనున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ ప్యారాచూట్ తో రెడీ అయిపోయాడు. అలా ఆకాశంలో ప్యారాచూట్ తో తిరుగుతు తిరుగుతూ..గాల్లో అలా ఎగురుతూ సరిగ్గా జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ మ‌ధ్య జ‌రిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా స్టేడియంలోకి వ‌చ్చేశాడు. అలా వచ్చి స్టేడియం మధ్యలో దిగాలని ప్లాన్ వేసుకున్నాడు.కానీ కాస్త డిస్ట్రబ్డ్ అయ్యింది.

ప్యారాచూట్ కాస్తా..ఓవ‌ర్‌హెడ్ కెమెరా వైర్ల‌కు త‌గలడంతో కంట్రోల్ కోల్పోయి..స్టేడియం పైక‌ప్పు దెబ్బ‌తిని దాని ముక్క‌లు స్టేడియంలోని అభిమానుల‌పై ప‌డడంతో కొంద‌రికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై యురోపియ‌న్ సాక‌ర్ తీవ్రంగా మండిప‌డింది. నిరసన తెలియజేయటానికి ఇదా వేదిక అంటూ ఫైర్ అయ్యింది. నిర‌స‌న‌కారుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని యూరోపియన్ సాకర్ తెలిపింది.

కాగా..ర‌ష్యాకు చెందిన గాజ్‌ప్రోమ్‌ సంస్థ ఆయిల్ ను వాడ‌కూడ‌దంటూ ‘గ్రీన్ పీస్’ సంస్థ కార్య‌క‌ర్త‌ స్టేడియం వ‌ద్ద‌ ‘కిక్ అవుట్ ఆయిల్ గ్రీన్ పీస్‘ అంటూ నినాదాలు చేశాడు. ఈ క్రమంలో సదరు నిరసనకారుడు మైదానంలో దిగిన వెంట‌నే ఆట‌గాళ్లు ఆంటోనియో రైగ‌ర్‌, రాబిన్ గోసెన్స్ అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లారు. దీంతో ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది. ఆ తరవాత భ‌ద్ర‌తా సిబ్బంది నిర‌స‌న కారుడిని అక్క‌డి తీసుకెళ్లటంతో ఆట తిరిగి 8 గంటలకు బిఎస్టి వద్ద మ్యాచ్ ప్రారంభమైంది.