‘గ్రీన్‌ పీ’ : పూలకుండీలే పబ్లిక్ టాయ్ లెట్స్..!!

  • Published By: nagamani ,Published On : August 22, 2020 / 10:29 AM IST
‘గ్రీన్‌ పీ’ : పూలకుండీలే పబ్లిక్ టాయ్ లెట్స్..!!

పూలకుండీలంటే రకరకాల మొక్కలు వేసుకుని వాటిని జాగ్రత్తగా సంరక్షించుకునేవి. ఇంట్లో పనికిరాని సామన్లను కూడా పూలకుండీలుగా వాడేసుకుంటుంటాం. కానీ ఆ పచ్చని మొక్కలతో కళకళలాడుతూ..ఆహ్లాదకరమైన పరిమళాలు వెదలజల్లే పూలకుండీలను టాయ్ లెట్స్ గా ఎవరైనా వాడతారా? అంటే మొఖం అంతా వికారంగా అసహ్యంగా పెడతాం కదూ…కానీ ఓ దేశం మాత్రం ఏకంగా పూలకుండీలనే టాయ్ లెట్స్ గా వాడేస్తోంది. అదికూడా ఇండివిడ్యువల్ గా కాదు పబ్లిక్ టాయ్ లెట్స్ గా…!! ఈ పూలకుండీల టాయ్ లెట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..చూసినవాళ్లంతా ఏంటీ ‘వింత ఆలోచన..కంపు ఆలోచన’ అంటున్నారు.



పూలకుండీలను పబ్లిక్ టాయ్ లెట్స్ గా వాడాలని నిర్ణయించింది ఆ దేశం పేరు నెదర్లాండ్ . అలా అనుకున్నదే తడవుగా కొన్ని ఏరియాలను కూడా సెలెక్ట్ చేసి ఆయా ప్రాంతాల్లో పూలకుండీలను అమర్చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాయిలెట్లుగా ఉపయోగించడానికి ప్రత్యేకమైన పూలకుండీలను అమర్చాలని నెదర్లాండ్స్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నెలర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యాంలో జనసంచారం ఎక్కువగా ఉండే కొన్ని ఏరియాలను గుర్తింంచి అక్కడ డచ్ కంపెనీ తయారు చేసిన పూలకుండీలను ఏర్పాటు చేసింది. ‘గ్రీన్‌ పీ’ అని పేరు పెట్టిన ఈ పూలకుండీలు అమర్చడం ద్వారా, ప్రజల్లో బహిరంగ మూత్ర విసర్జనను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కుండీల్లోని మూత్రాన్ని ప్లాంటర్స్ సేకరిస్తారు. దీన్ని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారట.



ఈ గ్రీన్ పీ ప్లాంట్స్ కు ఇరువైపులా ఉన్న ఓపెనింగ్స్ లో యూజర్లు మూత్ర విజర్జన చేస్తారు. వీటిలో గంజాయి మొక్కలకు నుండి జనపనార పీచుతో నిండిన అంతర్గత ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నిండినప్పుడు ఖాళీ చేస్తారు. ఆ ట్యాంక్ నిండిందా లేదా అనేది స్మార్ట్ సెన్సార్ ను ఉపయోగించి చెక్ చేయబడుతుంది.

అలా ఆ ట్యాంక్ ఖాళీ అయిన తరువాత సీటీలోని గార్డెన్స్..టెర్రాస్ గార్డెన్స్, సీటీకి సమీపంలో ఉండే వ్యవసాయ పొలాల్లో సేంద్రీయ ఎరువులు కోసం ఈ మూత్రంతో తడిసి ఉన్న జనపనార మిశ్రమాన్ని పంటపొలాలను వినియోగిస్తారు.



దేశ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యాం నగరంలో సిటీ కౌన్సిల్ మొట్టమొదటగా ప్రయోగం కోసం గ్రీన్ పీతో కలిసి 2018లో నాలుగు యూరినల్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది.గ్రీన్ పీ ఇన్ స్టాల్ చేసిన తరువాత వైల్డ్ పీయింగ్ లో 50 శాతం 50 తగ్గినట్లుగా గణాంకాల్లో తేలిందని గ్రీన్ పీ ఆవిష్కర్త్ రిజర్డ్ డీ తెలిపారు.

దీంతో ఆమ్‌స్టర్‌డ్యాం ఈ ప్రాజెక్టును విస్తరించాలని నగరంలోని సెంట్రల్ జిల్లాలో ఎక్కువగా గ్రీన్ పీస్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.