భార్యను చంపిన భర్త: పట్టిస్తే రూ.70 లక్షలు

  • Published By: veegamteam ,Published On : October 20, 2019 / 05:53 AM IST
భార్యను చంపిన భర్త: పట్టిస్తే రూ.70 లక్షలు

భార్యను హత్య చేసిన అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని పట్టి ఇస్తే రూ.70 లక్షల నగదు పారితోషకం ఇస్తామని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ప్రకటించింది. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మంది నిందితుల్లో భద్రేశ్ కుమార్ ఒకరని ఎఫ్ బీఐ తెలిపింది. అతని కోసం ఎఫ్ బీఐ అమెరికా, భారత్ లలో తీవ్రంగా గాలిస్తోంది.

ఎఫ్ బీఐ తెలిపిన వివరాల ప్రకారం అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ (24), పాలక్ (21)లు భార్యాభర్తలు. దంపతులిద్దరూ అమెరికాలోని హనోవర్ మేరిల్యాండ్ లోని డంకిన్ డోనట్ స్టోర్ లో పనిచేపేవారు. 2015 ఏప్రిల్ లో ఇద్దరూ డోనట్ స్టోర్ లో రాత్రి విధులు నిర్వహించారు. ఆ తర్వాత పాలక్ మృతదేహం దారుణ స్థితిలో కనిపించింది. అమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. 

విచారణ చేపట్టిన అధికారులు స్టోర్ లోని సీసీఫుటేజీని పరిశీలించి నివ్వెరపోయారు. హత్య జరిగిన రోజు రాత్రి భద్రేశ్ కుమార్ తన భార్య పాలక్ తో కలిసి స్టోర్ వంట గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత భద్రేశ్ కుమార్ తనకేమి తెలియనట్లుగా బయటికి వచ్చేయడం సీపీఫుటేజీలో కనిపించింది. స్టోర్ నుంచి కాలినడకన ఇంటికి వెళ్లి తన వ్యక్తిగత సామన్లలో కొన్నింటిని తీసుకొని సమీప ఎయిర్ పోర్టుకు చేరుకుని పరారయ్యారు.