Gum Disease Covid Risk : పంటి చిగుళ్లలో పాచితో కరోనా సోకే ముప్పు ఎక్కువ.. జాగ్రత్త..

పంటి చిగుళ్లలో పాచి పేరుకుపోయిందా? చిగుళ్ల వాపు వ్యాధితో బాధపడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ గమ్ డీసీజ్ (చిగుళ్లలో పాచి వ్యాధి)తో బాధపడేవారిలో కోవిడ్-19 వైరస్ తీవ్ర ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Gum Disease Covid Risk : పంటి చిగుళ్లలో పాచితో కరోనా సోకే ముప్పు ఎక్కువ.. జాగ్రత్త..

Gum Disease Covid Risk (1)

Gum Disease Covid Risk : పంటి చిగుళ్లలో పాచి పేరుకుపోయిందా? చిగుళ్ల వాపు వ్యాధితో బాధపడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ గమ్ డీసీజ్ (చిగుళ్లలో పాచి వ్యాధి)తో బాధపడేవారిలో కోవిడ్-19 వైరస్ తీవ్ర ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పళ్లలోని పాచిపై తిష్టవేసిన కరోనావైరస్ నోటిలోని లాలాజలం ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. లాలాజలం ద్వారా కరోనా వైరస్ సులభంగా నేరుగా రక్తకణాల్లోకి ప్రవేశించగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Gum Disease

అది కూడా చిగుళ్లపై పాచి సమస్యతో బాధపడేవారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని అంటున్నారు. వాయుమార్గాల కంటే రక్త నాళాలు మొదట్లో కోవిడ్ -19 వైరస్ బారిన పడ్డాయని యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. కరోనావైరస్ వృద్ధిచెందడానికి నోరు అనువైన ప్రాంతంగా నిపుణులు చెబుతున్నారు. దంతాల అనారోగ్యాల్లో డెంటల్ పాల్క్ (పాచి సమస్య)తో బాధపడేవారిలో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్ కు గురై తద్వారా వేగంగా ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరల్ లోడ్ తీవ్రతను తగ్గించాలంటే ప్రతిఒక్కరూ చౌకగా, ఎక్కువగా లభించే మౌత్ వాష్ ఉత్పత్తులను వినియోగించాలని సూచిస్తున్నారు. ఈ సాధారణ మౌత్ వాష్ లు కరోనా వంటి SARS-CoV2 వైరస్ నుంచి ప్రభావంతంగా ఎదుర్కోగలవని సూచిస్తున్నారు. కరోనా సోకిన బాధితుల్లో ఊపిరితిత్తులను స్కానింగ్ పరిశీలించగా.. వాటిలోనూ డెంటల్ సమస్యలతో సంబంధం ఉందని కనుగొన్నారు. అందుకే నోరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటే దంతాల ఆరోగ్యంతో పాటు ప్రాణాంతక కరోనా వైరస్ ల బారినుంచి కూడా రక్షిస్తాయని అంటున్నారు. చిగుళ్లలో రక్తస్రావం ద్వారా సూక్ష్మజీవులు నేరుగా రక్తంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Gum

దంతాలపై పేరుకుపోయే పాచిని ఎప్పటికప్పుడూ టూత్ బ్రష్ ద్వారా క్లీన్ చేసుకోవాలని, లేదంటే ప్రత్యేకమైన మౌత్ వాష్ లు లేదా ఉప్పునీటితో పుక్కలించినా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా నోటిలోని లాలాజంలో వైరస్ ప్రభావం క్షీణించడానికి సాయపడుతుందని చెబుతున్నారు. చిగుళ్లలోని రక్త నాళాల ద్వారా వైరస్ మెడ, ఛాతి గోడలలోకి వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తుల అంచులోని పల్మనరీ ధమనులు, చిన్న నాళాలలోకి పంపడానికి ముందు గుండెకు వైరస్ చేరుకుంటుందని అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలోనూ చిగుళ్ల వాపు వ్యాధి ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Virus Attack

హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి ప్రాణాంత వ్యాధుల ప్రభావం కూడా చిగుళ్ల వ్యాధి కారణంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పొగతాగే అలవాటు ఉన్నవారిలో చిగుళ్ల వ్యాధికి దారితీస్తుందని, వీరిలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కాలంలో నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఫలితంగా ఆయుష్షును పెంచుకోవచ్చునని సూచిస్తున్నారు. నోట్లో చిగుళ్ల అనారోగ్య సమస్యలతో బాధపడే కరోనా బాధితులు 9 రెట్లు ఎక్కువగా వైరస్ బారినపడి మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చిగుళ్ల వ్యాధి ఉన్నవారిలో 4.5 రెట్లు వెంటిలేటర్ అవసరం ఉండే ముప్పు ఉందని చెబుతున్నారు. నోటి అనారోగ్య సమస్యతో బాధపడేవారిలో 3.5 రెట్లు ఎక్కువగా ఐసీయూలో చేరే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.