Gun Firing : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 11మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది చనిపోయారు. కొలరాడోలోని ఓ మొబైల్‌ హోం పార్క్‌లో బర్త్ డే వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. స్పాట్ లోనే ఆరుగురు మృతిచెందగా.. చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Gun Firing : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 11మంది మృతి

Gun Firing

Gun Firing : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది చనిపోయారు. కొలరాడోలోని ఓ మొబైల్‌ హోం పార్క్‌లో బర్త్ డే వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. స్పాట్ లోనే ఆరుగురు మృతిచెందగా.. చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్న కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి ప్రవేశించిన వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలిపారు. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు వివరించారు.

అటు ఉడ్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి ఇరుగుపొరుగువారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు మృతిచెందారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత నిందితుడు ఆ ఇంటికి నిప్పంటించినట్లు తెలిపారు. అనంతరం ఎదురుకాల్పుల్లో నిందితుడు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికాలో కాల్పుల ఘటనలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ గన్ పేలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ఉన్మాది గన్ తో విరుచుకుపడతాడో తెలియడం లేదు. గన్ కల్చర్ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతి ఒక్కరి దగ్గర గన్లు ఉండటం, కోపం వస్తే వాటిని ప్రయోగించడం పరిపాటిగా మారింది. ఈ ఘటనల్లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.