America : అమెరికాలో గన్ కల్చర్.. మరోసారి కాల్పులు..నలుగురు మృతి

కొలరాడోలోని వేర్వేరు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే..నిందితుడిని పోలీసులు కాల్పి చంపారు.

America : అమెరికాలో గన్ కల్చర్.. మరోసారి కాల్పులు..నలుగురు మృతి

America

Gunman Kills Four in Denver Area : గన్ లో ఉండే తూటాకు తెలియదు ఎవరి ప్రాణంతో తీస్తుందో. అలాగే.. గన్ కు కూడా తెలియదు ఏ కుటుంబంలో విషాదాన్ని నింపుతుందో. అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఎక్కోడో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా..ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మళ్లీ తుపాకుల మోత మోగింది. కొలరాడోలోని వేర్వేరు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే..నిందితుడిని పోలీసులు కాల్పి చంపారు.

Read More : Earphones washing machine: బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం వాషింగ్ మెషిన్

డెన్వర్, లేక్ వుడ్ నగరాల్లో ఒకే వ్యక్తి నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా ఫైరింగ్ జరిపాడు. డెన్వర్ లో తొలుత కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి చనిపోయారు. అక్కడి నుంచి నేరుగా లేక్ వుడ్ కు వెళ్లాడు. అక్కడా కాల్పులకు దిగడంతో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తిని గాయపరిచాడని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో ఓ పోలీసు ఉన్నట్లు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు లేక్ వుడ్ ప్రాంతానికి చేరుకున్నారు. అతడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. తప్పించుకొనేందుకు పోలీసులపైకి గన్ ఎక్కుపెట్టాడు. దీంతో ప్రతిచర్యగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు అక్కడికక్కడే చనిపోయినట్లు లేక్ వుడ్ పోలీసు ప్రతినిధి జాన్ రొమెరో వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే..నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడో తెలియరాలేదు. ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Read More : Navjot Singh Sidhu : సిద్ధూ క్షమాపణలు చెప్పు..ఫైర్ అవుతున్న పంజాబ్ కాప్స్

ఇక అమెరికాలో గన్ కల్చర్ విషయానికి వస్తే…అక్కడ కాల్పుల ఘటనలు సర్వసాధారణమైపోయాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో దుండగులు తుపాకులతో రెచ్చిపోతున్నారు. తుపాకుల విషయంలో కఠిన చట్టాలు తీసుకరావాలనే డిమాండ్స్ ఉన్నా అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు తుపాకులు వాడుతున్నారంటే..పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీచర్ పై కోపం వస్తే..అమాంతం…బ్యాగులోంచి గన్స్ తీసుకుని..కాల్పులు జరిపిన ఘటనలు తెలిసిందే. ఇటీవలే అధికారంలోకి వచ్చిన బైడెన్ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.